ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM

ప్రధాన వార్తలు @ 5 PM

5pm topnews
ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Jul 12, 2021, 4:59 PM IST

  • జీవో 2 సస్పెండ్!

గ్రామ సచివాలయాలపై హైకోర్టులో విచారణ జరిగింది. సర్పంచులు, గ్రామ కార్యదర్శుల హక్కుల బదిలీపై వాదనలు విన్న కోర్టు.. ప్రభుత్వం జారీ చేసిన జీవో 2ను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను నాలుగువారాలు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొత్తగా 1,578 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,578 కరోనా కేసులు, 22 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న మరో 3,041 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అలా మాట్లాడితే అనర్హత వేటు వేస్తారా?'

దేవాలయాలపై దాడులు జరగకూడదని తాను చెప్పడం... వైకాపా నిర్ణయానికి వ్యతిరేకమా? అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రిని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడితే వేటు వేస్తారా అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తిరుపతిలో నిరుద్యోగ గర్జన...

తిరుపతిలో అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగ గర్జన చేపట్టారు. ఉద్యోగాలు లేని జాబ్ క్యాలెండర్​ను విడుదల చేసి, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని... తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జగన్నాథుడి రథయాత్ర

ప్రతిష్ఠాత్మక పూరీ జగన్నాథ్​ రథయాత్ర సోమవారం ప్రారంభమైంది. పూరీ రాజు పూజలు జరిపిన అనంతరం మొదటగా బలరాముడి రథం అయిన తలధ్వజను కదిలించి యాత్రను ప్రారంభించారు. కరోనా నిబంధనల కారణంగా ఈ ఏడాది భక్తల కోలాహలం లేకుండానే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సుప్రీం కీలక నిర్ణయం

పరువు హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేశారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించి నిందితుడి బెయిల్​ను సుప్రీం రద్దు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'హార్వెస్ట్​ విప్లవం రావాలి'

వ్యవసాయ రంగంలో 'పంట కోతల అనంతర విప్లపం'(Post harvest revolution) రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తోందని తెలిపారు. స్వయంసమృద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థతోనే ఆత్మనిర్భర్ భారత్​ సాధ్యమని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాలికపై పెట్రోల్​ పోసి నిప్పు

ఉత్తర్​ప్రదేశ్​ దారుణానికి పాల్పడ్డాడో కిరాతకుడు. బాలికపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. బులంద్​ షహర్​ జిల్లాలోని ముండాఖేడా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోహ్లీ ఐపీఎల్ టైటిలే గెలవలేదు..

విరాట్ కోహ్లీ సారథ్యంపై (Virat Kohli captaincy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనా(Suresh Raina). ఐసీసీ ట్రోఫీలను విరాట్​ గెలిచే విషయమై మాట్లాడాడు. అలాగే టీమ్‌ఇండియా(Team India)ను ఆ విధంగా అనేందుకు వీల్లేదని అన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఓటీటీలో వెంకటేశ్ 'నారప్ప'

విక్టరీ వెంకటేశ్ 'నారప్ప' ఎట్టకేలకు నేరుగా ఓటీటీలోనే విడుదల కానుంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ, సోమవారం కొత్త పోస్టర్​తో పాటు రిలీజ్ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details