ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - trending news

.

ప్రధానవార్తలు@5PM
ప్రధానవార్తలు@5PM

By

Published : Jul 13, 2020, 5:01 PM IST

  • కొనసాగుతున్న కరోనా ఉధృతి
    రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 1935 కరోనా కేసులు నమోదు కాగా రికార్డు స్థాయిలో 37 మరణాలు సంభవించాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • బస్సు సర్వీసులు నిలిపివేత
    బెంగళూరులో లాక్‌డౌన్ దృష్ట్యా ఈనెల 15 నుంచి 23 వరకు బస్సులు నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • సకాలంలో జీతాలు
    కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రెగ్యులర్‌ ఉద్యోగుల్లానే.. సకాలంలో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందించాలని సీఎం‌ ఆదేశాలు జారీ చేశారు. అలాగే వారికి సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని చెప్పారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • సీఎంకు బాలకృష్ణ లేఖ...ఎందుకంటే ?
    కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం, సీఎస్​లకు లేఖలు రాశారు. ప్రస్తుత జిల్లా కేంద్రం అనంతపురం హిందూపురం నుంచి 110 కిలో మీటర్లు దూరంలో ఉందని గుర్తు చేసిన ఆయన.. హిందూపురం జిల్లా కేంద్రమైతే అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • రూ.75వేల కోట్ల నిధి
    దేశంలో గూగుల్ భారీగా​ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రానున్న ఐదు నుంచి ఏడు ఏళ్లలో భారత్‌లో 75 వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్, ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'టెక్​ శక్తితో రైతులు, యువత జీవితాల్లో నవోదయం'
    భారతీయ రైతులు, యువత జీవితాలను మార్చే విధంగా సాంకేతికత శక్తిని సద్వినియోగం చేసుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ సోమవారం చర్చలు జరిపారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన ఈ భేటీలో డేటా భద్రతకున్న ప్రాముఖ్యం సహా ఇతర విషయాలపై పిచాయ్​తో సంభాషించినట్టు మోదీ ట్వీట్​ చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • లాభాలతో ముగిసిన మార్కెట్లు
    రిలయన్స్​ షేర్లు రికార్డు స్థాయికి చేరడం, అంతర్జాతీయంగా సానుకూలతల కారణంగా స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 99 పాయింట్లు వృద్ధి చెంది 36,693కు చేరింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 10,802 వద్ద స్థిరపడింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • ముంచెత్తిన వరదలు
    చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత నెల రోజుల నుంచి కురుస్తున్న వానల కారణంగా ఇప్పటి వరకు గల్లంతైన, మరణించిన వారి సంఖ్య 141కు చేరినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'బ్రాడ్​ను​ వదిలేయడమే ఇంగ్లాండ్​ చేసిన తప్పు
    వెస్టిండీస్​తో పోరులో స్టువర్ట్​ బ్రాడ్​ను ఎంపిక చేయకపోవడమే ఇంగ్లాండ్ చేసిన తప్పని జట్టు మాజీ కెప్టెన్ నాసర్​ హుస్సేన్​ అభిప్రాయపడ్డాడు. ​ ఈ క్రమంలోనే తొలి టెస్టులో విండీస్​ ఆటతీరును ప్రశంసించాడు హుస్సేన్​. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • ఆరోగ్యం మెరుగ్గా ఉంది
    కరోనా బారిన పడిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్​ల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వారికి కరోనా ప్రత్యేక చికిత్స అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details