- ప్రకాశం జిల్లాలో తుఫాన్ దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం
TOOFAN VEHICLE BURNT : ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కనిగిరి నుంచి నర్సరావుపేటకు వెళ్తున్న వాహనంలో దర్శి మండలం వెంకటాచలంపల్లి వద్ద ఇంజన్లో నుంచి పొగలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Somasila reservoir: సోమశిలకు పోటెత్తిన వరద.. ఆరు గేట్ల ద్వారా నీటి విడుదల
Somashila : రెండు రోజులుగా ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. వాగులు, వంకలు సైతం జలకళను సంతరించుకున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరు ప్రవహిస్తూ కనిపిస్తోంది. నెల్లురూ జిల్లాలో సైతం సోమశిల జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆరు గేట్లను తెరిచి.. 43 వేల క్యూసెక్కుల నీటికి కిందికి వదులుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బెజవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం
AGAN IN VIJAYAWADA : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మూలానక్షత్రం.. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
RUSH AT VIJAYAWADA TEMPLE : మూలా నక్షత్రం రోజు ఇంద్రకీలాద్రిపై సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తలు వేచి చూస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో క్యూలేన్లు నిండిపోయాయి. మధ్యాహ్నం ముఖ్యమంత్రి దర్శనానికి రానున్న నేపథ్యంలో గంట ముందు నుంచే దర్శనాన్ని నిలిపివేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుజరాత్లో కేజ్రీవాల్‌కు చేదు అనుభవం.. వాటర్ బాటిల్‌తో దాడి!
గుజరాత్ పర్యటనలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాజ్‌కోట్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్‌పై గుర్తు తెలియని ఓ వ్యక్తి ప్లాస్టిక్ బాటిల్‌ను విసిరాడు. మరోవైపు కాంగ్రెస్, భాజపాలు కుమక్కయ్యాయని కేజ్రీవాల్ ఆరోపించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి చిన్నారి మృతి.. ఛార్జింగ్ అవుతుండగానే..
Electric Bike Battery Blast : పర్యావరణానికి హాని కలగకూడదనే ఉద్దేశంతో వినియోగిస్తున్న ఎలక్టిక్ బైక్ వారి ఇంట విషాదం నింపింది. ఛార్జింగ్ పెట్టిన సమయంలో బ్యాటరీ పేలడం వల్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్టేడియంలో ఫ్యాన్స్ గొడవ.. 174 మంది దుర్మరణం
ఇండోనేషియాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన తొక్కిసలాటలో 174 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 180 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుండెపోటుతో 'విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా' కన్నుమూత.. మోదీ సంతాపం
సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు తులసీ తంతి.. గుండెపోటుతో కన్నుమూశారు. 'విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన ఆయన మరణం పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆసక్తిగా భారత్-పాక్ మ్యాచ్ ప్రోమో.. మీరు చూశారా?
ICC T20 World Cup 2022 : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమ్ఇండియా-పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్‌కు ప్రోమో తాజాగా విడుదలైంది. ఇది ఆద్యంతం ఆసక్తిగా ఉంటూ నవ్వులు పూయిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నిజమేనా భయ్యా.. పవన్ వాచ్, షూస్ ధర అన్ని లక్షలా?
పవన్‌కల్యాణ్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ఇటీవలే ఈ సినిమా ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్‌ను నిర్వహించారు. ఈ వర్క్ షాప్‌లో పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్, క్రిష్, కీరవాణి సహా పలువురు పాల్గొన్నారు. అయితే ఈ ఫొటోల్లో పవన్ లుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. రెడ్ టీషర్ట్, జీన్స్, షూస్ వేసుకుని అటూ ఇటూ తిరుగుతూ స్టోరీ డిస్కషన్ చేస్తూ కనిపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ ప్రధాన వార్తలు