- సమస్యల వలయంలో ఆర్బీకే లు.. రైతులకు తప్పని తిప్పలు
RBK : రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటు ధరలో ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు.. నిర్వహణ లోపాలతో ఇబ్బందులు పడుతున్నాయి. నెలల తరబడి అద్దె చెల్లించకపోవంతో చాలా చోట్ల భవన యజమానులు తాళాలు వేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 5కోట్ల మేర అద్దె బకాయిలు పేరుకుపోవటంతో.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం.. ఇద్దరు మృతి
Ramco Cement: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల రామ్‌కో సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలైయ్యారు. ఈనెల 28న ఈ పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడంతో తోటి కార్మికులు నిరసనకు దిగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీఎం ను మించిన నటుడు లేరు.. టాపిక్ డైవర్ట్ చేెయడం వెన్నతో పెట్టిన విద్య: అనిత
Anitha On CM Jagan : దిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం సతీమణి భారతితో పాటు వైకాపా నేతలపై వచ్చిన ఆరోపణలను పక్కదారి పట్టించడానికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారని..తెదేపా మహిళా నేత వంగలపూడి అనిత ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రజల దృష్టిని మరల్చేందుకే.. పేర్ల పిచ్చి పార్టీని ఎక్కడా చూడలేదు: సత్యకుమార్
BJP SATYA KUMAR COMMENTS : అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కొత్త నాటకాలకు తెరలేపుతోందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. అమరావతి రైతుల పాదయాత్ర నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చారన్నారు. మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకోని వైకాపా నేతలు...ఇప్పుడు రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారని సత్యకుమార్ మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భాజపాకన్నా 2 రెట్లు ఎక్కువ ఖర్చు.. ఫలితం శూన్యం.. పీకే స్కెచ్‌తో దీదీకి బిగ్ లాస్!
2022 ప్రారంభంలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ రూ.47.54 కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘానికి ఆ పార్టీ నివేదిక సమర్పించింది. టీఎంసీ.. గోవాలో ఖర్చు చేసిన మొత్తం భాజపాతో ఖర్చుతో పోలిస్తే రెండు రెట్లు అధికం. అధికార భాజపా రూ.17.75 కోట్లు ఖర్చు చేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ రూ.12 కోట్లు మేర వెచ్చించింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 14 గంటల్లో 35 కి.మీ దూరం ఈత..14 ఏళ్ల బాలుడి అరుదైన రికార్డు
తమిళనాడు థేనీ జిల్లాకు చెందిన బాలుడు స్విమ్మింగ్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 14 ఏళ్ల వయసులోనే పొడవైన కాలువను ఈది అరుదైన ఘనతను సాధించాడు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరోసారి ఉత్తర కొరియా కవ్వింపు.. ఆ దేశాలకు హెచ్చరికగా క్షిపణి పరీక్ష!
North Korea Missile Test : ఉత్తర కొరియా స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించింది ఉత్తర కొరియా. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు టైకాన్ అనే ప్రదేశం నుంచి ప్రయోగించారని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి.. ఏపీ, తెలంగాణలో ప్రస్తుత రేట్లు ఇవే..
Gold Rate Today : దేశంలో బంగారం ధర కాస్త పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఈసారి ప్రపంచకప్ మనదే'.. ఫేస్బుక్ లైవ్‌లో కుండబద్దలు కొట్టిన ధోనీ!
ప్రపంచ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్ ధోనీ. జార్ఖండ్ డైనమైట్.. కెప్టెన్ కూల్.. ద ఫినిషర్.. ఇలా ప్రతి అభిమాని మదిలో నిలిచిపోయాడు. ప్రపంచ క్రికెట్‌లో చెరగని ముద్ర వేసిన దిగ్గజాలు సైతం తనకు సలాం కొట్టేలా మైదానంతో సత్తా చాటాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ను వీడ్కోలు పలికిన అతడు ప్రస్తుతం ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా సీఎస్కేకు సారథ్యం వహిస్తున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆ అరుదైన అవకాశం ఆరాధ్యకు దక్కింది.. అదొక తీపి జ్ఞాపకం'
డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో అందాల తార ఐశ్వర్యరాయ్ సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎవరకీ దక్కని ఓ అరుదైన అవకాశం తన కుమార్తెకు దక్కిందని ఐశ్వర్య తెలిపారు. అదేంటంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ ప్రధాన వార్తలు