ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news

..

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Aug 3, 2022, 5:04 PM IST

  • 'అచ్యుతాపురం ఘటన'పై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి కమిటీకి ఆదేశం
    CM Jagan serious on Atchutapuram Gas Leak: అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీక్‌ ఘటనను తీవ్రంగా పరిగణించాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ జరిపించాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • MLC Ashok Babu: అది డైరెక్ట్ ట్రాన్స్​ఫర్ కాదు.. డూప్లికేట్ అండ్ బోగస్: ఎమ్మెల్సీ అశోక్ బాబు
    Jagananna thodu scheme: జగనన్న తోడు పథకం కింద సీఎం జగన్ బటన్ నొక్కి చేస్తున్నది డైరెక్ట్ ట్రాన్స్​ఫర్ కాదని.. డూప్లికేట్ అండ్ బోగస్ ట్రాన్స్​ఫర్ అని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవా చేశారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఖర్చు చేస్తున్న రూ.16 కోట్లలో రూ.10 కోట్లు కేంద్ర ప్రభుత్వానిదైతే.. రూ. 6 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిదని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాజధాని నిర్మాణానికి సీఎంపై కేంద్రం ఒత్తిడి తేవాలి: అమరావతి రైతులు
    BJP Padayatra: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం ప్రారంభిస్తే.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి రాజధానిలో నిర్మాణాలు పెరుగుతాయని రాజధాని రైతులు అభిప్రాయపడ్డారు. రాజధాని గ్రామాల్లో 'మనం-మన అమరావతి' పేరిట భాజపా చేస్తున్న పాదయాత్రలో అమరావతి రైతులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Attack: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని కారుతో ఢీకొట్టి
    Murder Attempt: ప్రేమిస్తున్నామంటూ వెంట పడతారు.. అమ్మాయి ఒప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు. తనకు అమ్మాయి దక్కలేదనే కక్షతో దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. ప్రాణాలు సైతం తీసేందుకు మృగాళ్లు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐసీయూలో రోగికి 'భూతవైద్యుడి' ట్రీట్​మెంట్​.. డాక్టర్లంతా అక్కడే ఉన్నా..
    పాము కాటుకు గురైన ఓ మహిళకు ఆమె కుటుంబసభ్యులు.. ఆసుపత్రి ఐసీయూలోనే భూతవైద్యం చేయించారు. ఆ సమయంలో.. డాక్టర్లంతా అక్కడే ఉన్నా కనీసం అడ్డుకోలేదు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మంకీపాక్స్ విషయంలో అలా చేయొద్దు'.. ప్రజలకు కేంద్రం కీలక సూచనలు
    దేశంలో మంకీపాక్స్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎనిమిది మంది ఈ వ్యాధి బారినపడగా.. ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలో తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. మంకీపాక్స్​ వ్యాప్తి నివారణకు ఏం చేయాలో, బాధితులతో ఎలా ఉండాలో వివరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పెలోసీ పర్యటనతో తైవాన్​ దిగ్బంధనం.. యుద్ధానికి చైనా సై​.. ఏ క్షణమైనా!
    China Taiwan War: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌, ఆ దేశ ఉక్కు మహిళ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తైవాన్‌ను జల, వాయు మార్గాల్లో చైనా దిగ్బంధనం చేసిన తీరు చూస్తుంటే తైవాన్‌పై డ్రాగన్‌ యుద్ధానికి దిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తైవాన్​పై చైనా ప్రతీకార చర్యలకు దిగింది. పలు దిగుమతులపై నిషేధం విధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర.. నేటి లెక్కలు ఇలా..
    Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సూర్య భాయ్​ జోరు.. ప్రపంచ ర్యాంకింగ్స్​లో దూకుడు.. నెం.1 దిశగా..
    Surya T20 rankings: వెస్టిండీస్​తో మూడో టీ20తో అదరగొట్టిన టీమ్​ఇండియా ప్లేయర్​ సూర్యకుమార్​ యాదవ్​.. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్​లోనూ దుమ్మురేపాడు. ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆడవాళ్ల ఉసురు పోసుకోకూడదు.. వారంతా గుర్తుంచుకోవాలి!: ఎన్టీఆర్​
    Juniour NTR emotional speech on women: వరుస సూపర్​ హిట్​ సినిమాలతో కెరీర్​లో దూసుకెళ్తున్న ఎన్టీఆర్​.. ఇటీవలే 'ఆర్​ఆర్​ఆర్'​తో ప్రేక్షకుల ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకున్నారు. నిజజీవితమైనా, తెరపైన అయినా ఎప్పుడూ ఒకేలా ఉంటూ లక్షలమంది అభిమానుల మనసును గెలుచుకున్నారు. అయితే ఆయన.. 'ఆడవాళ్ల ఉసురు పోసుకోవద్దు.. అందరూ గుర్తుంచుకోండి' అని వ్యాఖ్యలు చేశారు. అలా ఎందుకు అన్నారు? సందర్భం ఏంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details