- YCP Plenary: వైకాపా జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక
YSRCP lifetime president ys jagan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(వైకాపా) జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో తీర్మానం చేసి ఆమోదించారు. పారదర్శక పాలన-సామాజిక సాధికారత, పరిశ్రమలు-ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయంపై తదితర అంశాలపై తీర్మానాలు చేసిన వైకాపా నేతలు.. వాటిపై చర్చించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సామాజిక న్యాయ విద్రోహి.. జగన్ : అచ్చెన్న
Atchannaidu on ys jagan : అన్ని రకాల సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించడమేనా సామజిక న్యాయం? అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. వైఎస్ జగన్ సామాజిక న్యాయ విద్రోహి అని అచ్చెన్నాయుడు విమర్శించారు. 56 కార్పొరేషన్లతో మూడేళ్లలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వరదల్లో సర్వం కోల్పోయాం జగనన్న.. సాయం చేయండి'
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో సర్వం కోల్పోయిన నిర్వాసితుడు శివారెడ్డి.. వైకాపా ప్లీనరీకి తరలివచ్చారు. వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డునపడ్డానని.. సీఎం జగన్ న్యాయం చేయాలంటూ ప్లకార్డు ప్రదర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 3 కేజీల బంగారు ఆభరణాలతో.. డెలివరీ బాయ్స్ జంప్!
Gold Theft Case: ఎన్టీఆర్ జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో యజమానిని నమ్మించి 3 కేజీల బంగారం ఆభరణాలతో డెలివరీ బాయ్స్ఉడాయించారు. జైమాతాది లాజిస్టిక్స్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ములాయం సింగ్ యాదవ్‌కు సతీవియోగం
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌కు సతీవియోగం కలిగింది. ఆయన రెండో భార్య సాధనా గుప్తా శనివారం కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నాకు ఇండియానే నచ్చింది'.. పోలీసులకు కృతజ్ఞతలు: బధిర యువతి గీత
భారత్‌తో తప్పిపోయి పాక్‌కు వెళ్లి.. అప్పటి కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ చొరవతో తిరిగి స్వదేశానికి చేరుకున్న మధ్యప్రదేశ్‌కు చెందిన బధిర యువతి గీత ఎట్టకేలకు తన తల్లి దగ్గర ఆనందంగా జీవిస్తోంది. తాజాగా ఆమె తన కుటుంబసభ్యులతో భోపాల్ జీఆర్పీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చింది. ఎంతో చురుగ్గా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సైగల ద్వారా సమాధానాలిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీలంక నిరసనలు ఉద్ధృతం.. అధ్యక్షుడి నివాసం నుంచి పారిపోయిన రాజపక్స!
శ్రీలంక ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చినవేళ ప్రజాందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలు, ప్రజలు ఆయన నివాసాన్ని ముట్టడించగా... ఆయన పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ వర్గాలు వెల్లడించినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా.. వీటిని ఓసారి చెక్ చేసుకుంటే సరి.. వెంటనే లోన్!
Credit Score: ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు వాడే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. అయితే క్రెడిట్ కార్డు యూజర్ ఆర్థిక విషయాల్లో ఎంత క్రమశిక్షణగా ఉన్నాడో క్రెడిట్ స్కోర్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు క్రెడిట్ స్కోర్ తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంటుంది. అలాంటి సమయాల్లో ఓ సారి వీటిని చెక్ చేసి సరిచేసుకుంటే మళ్లీ స్కోరు గాడిన పడుతుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోహ్లీని ఎందుకు పక్కనపెట్టకూడదు?: కపిల్ దేవ్
Kapil dev on Kohli Form: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ ప్రదర్శనపై షాకింగ్ కామెంట్స్ చేశాడు దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్. టీ20ల నుంచి విరాట్ ఎందుకు పక్కన పెట్టకూడదని ప్రశ్నించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రణ్‌బీర్ రొమాన్స్.. భార్య ఆలియా అసూయ పడేలా వాణీకపూర్‌తో హాట్ షో..
బాలీవుడ్ రొమాంటిక్ హీరో రణ్‌బీర్ కపూర్.. పొడుగుకాళ్ల సుందరి వాణీ కపూర్.. హాట్‌హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్నారు. ఇద్దరు జంటగా నటించిన 'షంషేరా' జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా.. నిర్వహిస్తున్న ఫొటోషూట్స్‌లో.. వీరి రోమాంటిక్ షో అదిరిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
![AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM 5PM TOP NEWS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15778422-24-15778422-1657362937482.jpg)
ప్రధాన వార్తలు @ 5 PM