ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news

..

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Jul 6, 2022, 4:59 PM IST

  • 'నా భర్తకు ఏమైనా జరిగితే.. ఆ ఎమ్మెల్యేదే బాధ్యత'
    వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.. తన భర్తకు ఏమైనా జరిగితే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్​రెడ్డే బాధ్యులని.. వైకాపాకు చెందిన పగిడాల ఎంపీటీసీ సభ్యురాలు ప్రభావతి అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు వర్గీయులు తన భర్త భాస్కర్​ను అడ్డగించి బెదిరించారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రెండు రోజులుగా వర్షాలు.. తిరుమల కనుమదారిలో విరిగిపడిన కొండచరియలు
    వర్షాలకు తిరుమల రెండో కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ కనుమదారిలోని ఓ ప్రాంతంలో బండరాళ్లు నేలకు జారాయి. స్వల్పంగానే బండరాళ్లు జారడంతో వాహన రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. అప్రమత్తమైన తితిదే అధికారులు.. జారిపడిన కొండరాళ్లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • "మా బడి మాక్కావాలి.. మీ విలీనం మాకొద్దు"
    Agitations over Schools merge: పాఠశాలల విలీనంపై రాష్ట్రంవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పాఠశాలల ఎదుట ఆందోళనకు దిగారు. బడులు మూతపడితే.. పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చదువులో గోల్డ్‌మెడలిస్ట్.. "కిక్" సినిమాను రిపీట్ చేశాడు!
    "కిక్" సినిమా చూశారా? అందులో హీరోకు ఏ పనిలోనూ కిక్కు రాదు. సూపర్ టాలెంట్ ఉంటుంది. కానీ, ఏ ఉద్యోగంలో చేరినా.. నెల రోజులకన్నా ఎక్కువ పనిచేయడు. చివరాఖరికి దొంగతనాలు చేయడంలో కిక్కు వెతుక్కుంటాడు! ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్టోరీలో ఘనుడు కూడా ఇదే రకానికి చెందిన అదోరకం మనిషి. చదువులో అద్భుతమైన ప్రతిభావంతుడు. ఏకంగా.. MBAలో గోల్డ్ మెడల్ సాధించాడు! కానీ.. పని చేయడానికి బద్ధకించాడు! దొంగతనంలో కిక్ వెతుకున్నాడు..! సీన్ కట్ చేస్తే.. ఏకంగా 200 చోరీలు చేశాడు!! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఈ రాష్ట్రంలోనూ ఏక్​నాథ్​ శిందే పుట్టుకొస్తారు'.. భాజపా 'నాన్​సెన్స్​' జోస్యం!
    ఏక్​నాథ్​ శిందే లాంటి వ్యక్తి తమిళనాడులోనూ పుట్టుకొస్తారని అన్నారు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై. మహారాష్ట్ర తరహాలో అక్కడ కూడా అధికార మార్పిడి ఖాయమని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యల్ని అధికార డీఎంకే తోసిపుచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ముంబయిని ముంచెత్తిన వర్షాలు.. 'మహా'లో మరో 3 రోజులు కుండపోతే..!
    Maharashtra Rain: మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా మూడో రోజు ముంబయిని భారీ వానలు అతలాకుతలం చేశాయి. చాల్​ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు జలమయమయ్యాయి. రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్రిటన్​లో రాజకీయ సంక్షోభం.. మరో నలుగురు మంత్రుల రాజీనామా
    Britain political crisis: బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ స‌ర్కార్ రాజ‌కీయ సంక్షోభంలో చిక్కుకుంది. మంగళవారం ఆర్థిక మంత్రి రిషి సునాక్​, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్​ రాజీనామా చేయగా.. తాజాగా మరో నలుగురు మంత్రులు అదే బాటలో నడిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
    Gold Price Today: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.53,200గా ఉండగా.. కిలో వెండి ధర రూ.58,130కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీమ్ఇండియాకు షాక్.. డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత.. పాక్ కంటే దిగువకు..
    Teamindia WTC Points: ఇంగ్లాండ్​తో జరిగిన ఐదో టెస్టులో ఓడిన టీమ్​ఇండియాకు.. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో మరో చేదు అనుభవం ఎదురైంది. ఈ మ్యాచ్​లో స్లో ఓవర్​ రేటు కారణంగా మ్యాచ్​ ఫీజులో 40 శాతం కోత విధించడం సహా 2 పాయింట్లను తగ్గించింది ఐసీసీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జలకన్యలుగా స్టార్​ హీరోయిన్స్​.. నీటి అడుగున ఆ అందాలను చూస్తే..
    బీచ్​లో గానీ.. స్విమ్మింగ్​ వద్ద గానీ.. బికినీలో దర్శనమిచ్చే హీరోయిన్లను చాలా సార్లు చూసి ఉంటాం. అయితే కొందరు బికినీ ధరించి.. వేరు వేరు సమయాల్లో నీటి అడుగున స్కిన్​ షో చేశారు. నీటిలో మునిగి.. తమ అందాలతో మైమరించారు. ఆ స్టార్​ హీరోయిన్లు సోగయాలను చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details