ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news

..

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Jun 29, 2022, 4:57 PM IST

  • నూతన పీఆర్సీ పిటిషన్​పై హైకోర్టులో విచారణ..
    PRC: నూతన పీఆర్సీపై గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నగదు డ్రా పై పరిశీలించి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామన్న న్యాయస్థానం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వైకాపా నిర్ణయాలతో.. పోలవరానికి తీవ్ర నష్టం: చంద్రబాబు
    CBN LETTER: వైకాపా ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందంటూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పోలవరంపై కేంద్రం, పీపీఏ రాష్ట్రానికి చేసిన సూచనలు, హెచ్చరికల్ని.. ప్రభుత్వం పెడచెవిన పెట్టిందంటూ.. అంశాల వారీగా వివరించారు. కాంట్రాక్టర్‌ను మార్చే క్రమంలో ప్రాజెక్టు వరద నిర్వహణ పనులు చేపట్టని కారణంగా.. డయాఫ్రంవాల్ పాడైందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకూ రక్షణ లేకుండా పోయింది '
    Ashok Babu on GPF: రాష్ట్రంలో ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకూ రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్ల డబ్బు మాయమైతే ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. డబ్బు మాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అనకాపల్లి జిల్లాలో పులి సంచారం.. పాడి గేదెపై దాడి
    Tiger in anakapalle district: ఇన్ని రోజులూ కాకినాడ జిల్లా వాసులను హడలెత్తించిన పులి.. ఇప్పుడు అనకాపల్లి జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. కోటవురట్ల మండలం శ్రీరాంపురంలో ఓ గేదెపై పులి పంజా విసిరడం.. తోటల్లో పులి అడుగులు కనిపించడంతో.. స్థానికులు బెంబేలెత్తి పోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముహూర్తం ఫిక్స్.. వెంకయ్య వారసుడు ఎవరో?
    Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రకటన విడుదలైంది. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు వారసుడు ఎవరనే అంశంపై చర్చ ప్రారంభమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Viral Video: 18 అడుగుల పైథాన్.. గ్రామస్థులు హడల్​
    Python Video: ఉత్తరాఖండ్ లక్సర్​లోని లాల్​పుర్​ గ్రామంలో 18 అడుగుల పైథాన్​ గ్రామస్థులను హడలెత్తించింది. రోజూలాగే పొలానికి వెళ్లిన ఉదయ్ సింగ్ అనే రైతు బోరుబావి వద్ధ భారీ కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మందు కొట్టి పాముతో 'ఆట'.. పురుషాంగంపై కాటుతో మృతి
    Youth Died Of Snake Bite: మద్యం మత్తులో ఓ యువకుడు.. విషపూరితమైన పాముతో చెలగాటం ఆడాడు. అది కాస్తా అతడి పురుషాంగంపై కాటు వేసింది. దీంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆ యువకుడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హైదరాబాద్, విశాఖలో బుధవారం బంగారం ధరలు ఇలా..
    Gold Price Today: బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,630గా ఉంది. కిలో వెండి ధర రూ.61,200గా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐపీఎల్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. ఇకపై మరింత మజా!
    IPL Extended Two and half months: ఐపీఎల్​లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్‌ ఆటగాళ్లు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాడు బీసీసీఐ కార్యదర్శి జై షా. లీగ్​ను మరో రెండు వారాలు పొడిగించేలా చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బహుభాషా నటుడు నాజర్​ సినిమాలకు గుడ్​బై చెప్పనున్నారా?
    Actor Nazar retirement: బహుభాషా చిత్రాల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షాదరణ పొందిన నటుడు నాజర్​. నటనలోనే కాకుండా.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్​.. అడపాదడపా ప్లేబ్యాక్‌ సింగర్​గానూ రాణించారు. ఆపై దర్శకుడు, నిర్మాతగానూ కెరీర్​ను కొనసాగించారు. అయితే ఇప్పుడాన సినిమాలకు రిటైర్మెంట్​ ప్రకటించబోతున్నారని తెలిసింది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details