- బ్రేకుల్లేని బుల్డోజర్లా.. లోకేశ్ వారిని తొక్కేస్తారు: పట్టాభి
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చేశారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. వైకాపా అక్రమాలు ఇంకా ఎంతో కాలం సాగవని హెచ్చరించారు.
- సొంతానికి సంతర్పణ.. వైకాపా కార్యాలయాలకు కోట్ల విలువైన భూముల కేటాయింపు
వైకాపా జిల్లా కార్యాలయాల కోసం ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ స్థలాలు కేటాయించేస్తున్నారు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవాలని వైకాపా పెద్దలకు ఆలోచన వచ్చిందే తడవుగా చకచకా పావులు కదులుతున్నాయి. స్థలం చూడటం.. విజ్ఞప్తి పంపడం వరకే నాయకుల వంతు.
- బ్లేడుతో గొంతు కోసి.. తల్లిని చంపేశాడు..!
నవమాసాలు కడుపులో మోసిన తల్లిని.. పేగు తెంచుకు పుట్టిన కొడుకే కర్కశంగా చంపేశాడు! వేకువజామున ఎవరూ లేని సమయంలో తల్లి గొంతుకోసి ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది.
- ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే.. అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు: చంద్రబాబు
చోడవరం మినీమహానాడు వేదికగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు చేయించారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెలుగుదేశంలో బలమైన బీసీ నేతలే లక్ష్యంగా.. జగన్ రెడ్డి అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
- 'అగ్నిపథ్‌పై వెనక్కి తగ్గం.. ఆ నిరసనకారులను చేర్చుకోం!'
సైన్యాన్ని యువత, అనుభవజ్ఞుల కలయికతో తయారు చేసేందుకే అగ్నిపథ్ స్కీమ్‌ను తీసుకొచ్చినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సర్వీసులో వారి పట్ల వివక్ష ఉండబోదని హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని వెనక్కి తీసుకునేదే లేదని తేల్చి చెప్పారు.
- ముస్లిం పెళ్లిలో 'బుల్డోజర్ బరాత్'.. అంతా యోగి మహిమ!
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈమధ్య ఎక్కడ చూసినా 'బుల్డోజర్' మాటే వినిపిస్తోంది. అయితే, ఇది నేరస్థుల ఇళ్లను ప్రభుత్వాలు కూల్చేయడానికే పరిమితం అనుకుంటే పొరపాటే! ఇటీవల ఓ ముస్లిం జంట వివాహ వేడుకలోనూ బుల్డోజర్ కనిపించింది.
- పక్షి దెబ్బకు విమానంలో మంటలు.. టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదం.. లక్కీగా...
పట్నా నుంచి దిల్లీకి వెళ్లాల్సిన స్పైట్‌జెట్ విమానంలో మంటలు చెలరేగాయి. అయితే మంటలను గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయగా.. ఎటువంటి నష్టం జరగలేదు. ఇంజిన్‌ను పక్షి ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్పైస్‌జెట్ ప్రతినిధులు తెలిపారు.
- డెబిట్, క్రెడిట్ కార్డులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. పేమెంట్స్ ఇక భద్రం!
కార్డుల వినియోగంలో పారదర్శకతతో పాటు వినియోగదారుల హక్కులు పరిరక్షించేలా కొత్త నిబంధనల్ని తీసుకువచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీటిని జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
- ఒకే జట్టులో కోహ్లీ, బాబర్..? సూపర్ సిరీస్‌కు రంగం సిద్ధం!
ప్రపంచంలోని మేటి ఆటగాళ్ల జాబితాలో ఉన్న విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ ఒకే జట్టులో ఓ మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుంది..? ఏకంగా ఓ సిరీస్ ఆడితే..? అది మీ ఊహకే వదిలేస్తున్నాం. అసలు ఇది జరిగే అవకాశముందా అని మీకు డౌటా? అది కార్యరూపం దాల్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఎలా అంటే?.. అదే 'ఆఫ్రో-ఆసియా కప్'.. ఈ కప్ గురించి మీకు తెలుసా?
- ఓటీటీలోకి అందాల భామ ఎంట్రీ.. యాక్షన్ కింగ్ దర్శకత్వంలో విశ్వక్సేన్!
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తన కెరీర్లో తొలిసారిగా ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. మరోవైపు, హీరో విశ్వక్సేన్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించనున్నారు.