- ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్ ఇంటికే : చంద్రబాబు
Chandrababu on way to Ongole: ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఒంగోలులో జరగనున్న తెలుగుదేశం మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు బయల్దేరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివెళ్లారు.
- శ్రీకాకుళంలో ప్రారంభమైన.. "సామాజిక న్యాయ భేరి" బస్సు యాత్ర
BUS TOUR: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేస్తున్న సామాజిక న్యాయం.. ప్రజలకు వివరించేందుకు.. "సామాజిక న్యాయ భేరి" పేరిట వైకాపా మంత్రులు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని ఏడు రోడ్ల కూడలిలో వైకాపా బస్సు యాత్ర ప్రారంభమైంది.
- "బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏం చేశారో చర్చించేందుకు.. వైకాపా సిద్ధమా? : అచ్చెన్న
Achennaidu: అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏంచేశారో చర్చించేందుకు వైకాపా నేతలు సిద్ధమా? అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
- నలుగురి ప్రాణం తీసిన ఫ్లెక్సీ..!
Road accident: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాసానగరం సమీపంలో ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో.. ప్రమాద స్థలంలోనే నలుగురు మరణించారు.
- తెలంగాణలో అడుగుపెట్టగానే ఆ విషయం అర్థమైంది : ప్రధాని మోదీ
Modi in Hyderabad: తెలంగాణ గడ్డపై అడుగుపెట్టగానే ఇక్కడి గాలి కాషాయంవైపే వీస్తోందనే విషయం అర్థమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడి ప్రజల్లో మార్పు మొదలైందని తెలిపారు. తెలంగాణ గడ్డపై భాజపా జెండా ఎగరడం ఖాయమనిపిస్తోందని చెప్పారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో మోదీ ప్రసంగించారు.
- 500కుపైగా కేసులు.. రూ.84 లక్షల రివార్డ్.. మావోయిస్టు అగ్రనేత అనుమానాస్పద మృతి!
Maoist sandeep yadav: బిహార్‌లోని గయా జిల్లా లుటువా పోలీస్ స్టేషన్ పరిధిలో టాప్ మావోయిస్టు లీడర్ సందీప్ అలియాస్ విజయ్ అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. సందీప్‌పై 500కుపైగా కేసులు, రూ.84 లక్షల రివార్డు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
- తలసేమియా ఉందని రక్త మార్పిడి.. నలుగురు పిల్లలకు హెచ్ఐవీ.. ఒకరు మృతి
HIV Blood Transfusion: బ్లడ్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నలుగురు చిన్నారులు హెచ్ఐవీ బారినపడ్డారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో జరిగిందీ ఘటన.
- దారుణం.. ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్.. 11 మంది చిన్నారులు మృతి
ఓ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు మరణించారు. ఆఫ్రికన్ దేశమైన సెనెగల్‌లోని టివయూనే పట్టణంలో జరిగిందీ ఘటన.
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్
Gold Rate Today: బంగారం, వెండి ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల పసిడి రూ.52వేల 520 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.63 వేలకు చేరింది. మరోవైపు స్టాక్ మార్కెట్లు 3 వరుస సెషన్ల నష్టాల అనంతరం పుంజుకున్నాయి.
- NBK107: ఫ్యాన్స్‌కు పూనకాలే.. బాలయ్య కొత్త సినిమా టైటిల్ ఫిక్స్!
NBK107 Movie Title: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'NBK107'(వర్కింగ్ టైటిల్). గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్‌ను ఎట్టకేలకు ఫిక్స్ చేశారని తెలిసింది. ఫ్యాన్స్ పూనకాలొచ్చే పేరును పెట్టినట్లు సమాచారం. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే?