ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @5PM - తెలుగు తాజా వార్తలు

.

ప్రధాన వార్తలు @5PM
ప్రధాన వార్తలు @5PM

By

Published : Mar 24, 2022, 5:05 PM IST

Updated : Mar 24, 2022, 5:16 PM IST

  • ప్రభుత్వ లక్ష్యం అదే.. అందుకోసమే కొత్త మద్యం పాలసీ, బ్రాండ్లు: తెదేపా
    సారా ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామనడం సిగ్గుచేటని ప్రభుత్వంపై తెదేపా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మద్యంపై ఐదేళ్లలో పదివేల కోట్ల ఆదాయమే ముఖ్యమంత్రి లక్ష్యమని వారు ఆరోపించారు. అందుకోసమే కొత్తబ్రాండ్లు, కొత్త పాలసీ తెచ్చారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విజయవాడ లెనిన్‌ సెంటర్‌ వద్ద ఉద్రిక్తత, విద్యార్థుల అరెస్టు
    విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఉద్రికత్త నెలకొంది. విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చిన చలో విజయవాడకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీఎం జగన్ అలా చెప్పడం విడ్డూరంగా ఉంది: నాగబాబు
    నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు. నాటుసారా అమ్మకందారులను సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కరుగుతున్న కాలజ్ఞాన కొండ... కానరాని అండ
    కర్నూలు జిల్లాలో ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న రవ్వలకొండ అక్రమార్కుల అడ్డగోలు తవ్వకాలతో కరిగిపోతోంది. ఇష్టానుసారం తవ్వకాలు చేపట్టడంతో ఎంతో ప్రాధాన్యమున్న బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రభుత్వ వేడుకల్లో అపశ్రుతి.. 150మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్!
    ఫుడ్​ పాయిజన్​తో 150 మందికిపైగా విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. బిహార్​ దివస్​ వేడుకల్లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కార్లు, బైక్​లతో ఇంటర్​ విద్యార్థుల స్టంట్​ షో.. పోలీసుల షాక్​!
    కేరళ కోజికోడ్‌లో ఇంటర్‌ విద్యార్థులు కార్లు, ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫైనల్‌ పరీక్షలు పూర్తయిన సందర్భంగా విద్యార్థులు సంబరాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏడాది క్రితం కొన్న 'వైన్​ బాటిల్'​లో పాము.. చచ్చి ఉంటుందిలే అని ఓపెన్ చేస్తే...
    ఏడాది క్రితం కొనుగోలు చేసిన వైన్​ బాటిల్​ ఓపెన్​ చేసిన వ్యక్తికి ప్రాణం పోయినంత పనైంది. ఆ సీసాలో ఉన్న ఓ విషపూరిత సర్పం.. ఒక్కసారిగా లేచి, అతడ్ని కాటేసింది. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లిన ఆ వ్యక్తికి వైద్యులు సకాలంలో చికిత్స చేసి, బతికించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు.. భారీగా పెరిగిన పేటీఎం షేరు
    తీవ్ర ఒడుదొడుకుల ట్రేడింగ్​లో స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. సెన్సెక్స్​ 89, నిఫ్టీ 23 పాయింట్లు కోల్పోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రికార్డుల రారాజు.. హిట్​ వదలని 'విక్రమార్కుడు'
    దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్​ఆర్​ఆర్'​ మార్చి 25న విడుదల కానుంది. ఈ మూవీ బాక్సాఫీస్​ను బద్దలకొట్టి రూ.3వేల కోట్లు సాధిస్తుందని సినీవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీఎస్కే కెప్టెన్​గా తప్పుకున్న ధోనీ..కొత్త సారథి అతడే
    మరో రెండు రోజుల్లో ఐపీఎల్​ 15వ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ సోషల్​మీడియా ద్వారా తెలిపింది. ఈ సీజన్​ నుంచి కెప్టెన్​ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించనున్నట్లు వెల్లడించింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
Last Updated : Mar 24, 2022, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details