- అక్టోబరు 25 నుంచి పేదల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి: సీఎం జగన్
వైఎస్సార్ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. అక్టోబరు 25 నుంచి పేదల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్మాణ సామగ్రిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియా
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు రాజ్ భవన్లోని తన ఛాంబర్లో సంతకం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కుటుంబ కలహాలు.. క్షణికావేశంలో కఠిన నిర్ణయం..
క్షణికావేశంలో భార్య భర్తను హత్య చేసింది. కుటుంబ కలహాల కారణంగా విచక్షణ కోల్పోయి రోకలి బండతో దాడి చేసి దారుణంగా హతమార్చింది. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షణికావేశంలో భార్య నిర్మల.. భర్తపై రోకలి బండతో దాడి చేసింది. ఈ క్రమంలో భర్త మరణించాడు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాఖీ రోజు విషాదం.. అక్క మరణాన్ని తట్టుకో లేక తమ్ముడు మృతి
అక్కంటే పంచప్రాణాలు ఆ తమ్ముడికి. తల్లిలా లాలించే అక్క మీద మమకారంతో పెళ్లి కూడా చేసుకోకుండా అక్క కుటుంబమే తన కుటుంబంగా భావించి.. వారితో ఉండిపోయాడు. చివరకు అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి రోజే వారిద్దరు తనువు చాలించారు. అనారోగ్యంతో అక్క మృతి చెందటంతో... తట్టుకొలేకపోయిన ఆ తమ్ముడు గుండెపోటుతో మరణించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అయోధ్య గుడికి వెళ్లే రోడ్డుకు కల్యాణ్ సింగ్ పేరు
ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. కల్యాణ్ సింగ్ భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు పార్టీ నేతలు, అభిమానులు తరలి వచ్చారు. మరోవైపు, అయోధ్య సహా పలు నగరాల్లో రహదారులకు కల్యాణ్ సింగ్ పేరు పెట్టనున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సీఎం కానుక- కాలేజీలో చేరే ప్రతి అమ్మాయికి రూ.20 వేలు!