ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

ప్రధాన వార్తలు @ 5 PM

5pm top news
ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Aug 8, 2021, 4:59 PM IST

  • మందడంలో ఉద్రిక్త వాతావరణం

మందడంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైకోర్టు వైపు వెళ్లేందుకు అమరావతి రైతుల ప్రయత్నించారు. అనంతరం మందడం రహదారిపై బైఠాయించి మహిళలు నిరసన తెలియజేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'విధ్వంసం సృష్టిస్తున్నారు'

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతిలో జగన్ విధ్వంసం సృష్టిస్తున్నారని సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. 600 రోజులుగా రైతులు, మహిళలు, రైతు కూలీలు సుదీర్ఘ ఉద్యమం చేస్తున్నా.. ముఖ్యమంత్రి ఏ మాత్రం స్పందించకపోవడం బాధకరమన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నవ్వుల టానిక్' చికిత్స..

అబ్బా...! ఇది ఓ యూట్యూబ్ ఛానల్ పేరు. పేరుకు తగ్గట్టే నవ్వులు పూయించే సున్నితమైన కామెడీ వీడియోలు ఈ ఛానల్ లో ఉంటాయి. నటనపై ఉన్న మక్కువతో.. చిన్నారుల డాక్టర్ చేస్తున్న ఈ ప్రయత్నం.. సత్ఫలితాన్నిస్తోంది. వైద్యాన్ని ఇలా కూడా చేయవచ్చని నిరూపిస్తోంది. ఇంతకీ.. ఈ కామెడీ ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్ ఎవరు? ఎక్కడివారు? చిన్నారులను ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఆ విశేషాలు మనమూ తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మరింత మంది నీరజ్ చోప్రాలు అవుతారు

నీరజ్ చోప్రా ఒలంపిక్స్​లో బంగారు పతకం సాధించడంపై ఆంధ్రప్రదేశ్​ అథ్లెటిక్స్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది. సరైన ప్రొత్సాహం లభిస్తే భవిష్యత్ ఒలింపిక్స్ క్రీడల్లో.. మరిన్ని స్వర్ణ పతకాలు సాధించే సత్తా మన యువతకి ఉందని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఉల్లంఘన విచారకరం'

జైళ్లలో ఇప్పటికీ హింస కొనసాగుతుండటం ఆందోళనకరమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. పోలీసులు సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉగ్రవేటలో ఎన్​ఐఏ

రెండేళ్ల క్రితం నిషేధం విధించిన జమాత్​-ఏ-ఇస్లామీ మత సంస్థకు చెందిన సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) విస్తృత సోదాలు నిర్వహించింది. జమ్ముకశ్మీర్​లోని 45 ప్రాంతాల్లో ఆదివారం ఈ తనిఖీలు చేపట్టింది. మరోవైపు.. కర్ణాటక బెంగళూరులోనూ ఎన్​ఐఏ సోదాలు నిర్వహించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యడ్డీ వినతి

తనకు కేబినెట్​ హోదాను కేటాయిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మైను ఆ రాష్ట్ర మాజీ సీఎం యడియూరప్ప కోరారు. తనకు మాజీ ముఖ్యమంత్రులకు ఉండే వసతులు మాత్రమే కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వింత చేప..!

దంతాలు ఉన్న చేపను మీరు ఎప్పుడైనా చూశారా..? అదీ అచ్చం మనిషి దంతాలను పోలి ఉండటాన్ని చూస్తే మీరు అవాక్కవ్వాల్సిందే. అంతేకాక ఈ చేప గొర్రె తలను పోలి ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ చేప తెగ వైరల్ అవుతోంది. ఈ వింత చేపను మీరూ చూసేయండి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐసీసీ రేసులో ఉన్నది వీరే..

జులై నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్' (ICC POTM) నామినేషన్లను ప్రకటించింది ఐసీసీ (ICC). పురుషుల క్రికెట్​ నుంచి ముగ్గురు, మహిళలు ముగ్గురు ఉన్నారు. వారి ప్రదర్శనలు ఎలా ఉన్నాయంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎన్టీఆర్​కు ఏమైంది..​

ఎన్టీఆర్​ ముఖంపై ఉన్న గాయం గురించి క్లారిటీ ఇచ్చింది 'ఆర్​ఆర్​ఆర్'(RRR movie) చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఉక్రెయిన్​లో జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details