- ttd tickets: శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన టికెట్లను రేపటి నుంచి ఆన్ లైన్లో అందుబాటులో ఉంచనుంది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- CM REVIEW:ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
కొవిడ్ వ్యాప్తి నియంత్రణ, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాన్సన్ట్రేటర్లు, డీ-టైప్ సిలెండర్లపై, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- MPTC AND ZPTC ELECTIONS: పరిషత్ ఓట్ల లెక్కింపుపై విచారణ వాయిదా
పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై విచారణ ఆగస్టు 4కి వాయిదా పడింది. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు అప్పీల్‌కు వెళ్లింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌కు నివాళలర్పించిన చంద్రబాబు, లోకేశ్
తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.. ఆంధ్రా షుగర్స్ సంస్థ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు ముళ్లపూడి హరిశ్చంధ్ర ప్రసాద్‌కు నివాళులర్పించారు. ఆయన చేసిన సమాజ సేవను స్మరించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'కరోనాపై పోరుకు భారత్, అమెరికా నాయకత్వం'
కరోనా మహమ్మారని అంతం చేసేందుకు ప్రపంచ దేశాలకు అమెరికా, భారత్ నాయకత్వం వహిస్తాయన్నారు అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్. కొవిడ్ సమయంలో అమెరికాకు భారత్ చేసిన సాయాన్ని ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. అలాగే.. అఫ్గానిస్థాన్‌లో బలగాల ఉపసంహరణ పూర్తయినప్పటికీ ఆ దేశానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. శాంతి, సురక్షితమైన అఫ్గాన్ కోసం ఇరు దేశాలు కృషి చేయాలని అంగీకరించినట్లు చెప్పారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పెళ్లి వేదికపై వధూవరులు కబడ్డీ కబడ్డీ!