- ఉత్తర్వుల్లో మార్పులు..
ఇంటింటికీ రేషన్ పంపిణీ కోసం మినీ ట్రక్కుల కొనుగోళ్లకు సంబంధించి ఇచ్చే 90 శాతం మేర రాయితీ మొత్తాన్ని నేరుగా లబ్దిదారుల రుణ ఖాతాలకు చెల్లించాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ సహకార ఆర్ధిక కార్పొరేషన్‌ను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అధికారులు తరచూ తనిఖీ చేయాలి..
కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాలను అధికారులు తరచూ తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సరిగా తనిఖీలు చేయనివారికి మెమోలు జారీచేయాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్పందన రాలేదు: కేంద్ర హోంశాఖ..
దిశ బిల్లుపై ఏపీ నుంచి తిరిగి స్పందన రాలేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. రాష్ట్రం పంపిన దిశ బిల్లులో అభ్యంతరాలపై వివరణ కోరామని.. అయితే దానిపై ఏపీ ఇప్పటివరకు స్పందించలేదని లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌కుమార్ అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సర్పంచ్ దారుణ హత్య..
కడప జిల్లా లింగాల మండలం కోమన్నూతల సర్పంచ్‌ను దారుణ హత్యకు గురయ్యాడు. వైకాపా సానుభూతి పరుడైన సర్పంచ్ మునెప్పను ప్రత్యర్థులు చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆధిపత్య పోరు కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్త సీఎంపై కాసేపట్లో స్పష్టత!
యడియూరప్ప రాజీనామాతో కొత్త ముఖ్యమంత్రి కోసం 'రాజకీయ వేట' మొదలైంది. ఇప్పటికే అధిష్ఠానం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకత్వాలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చేలా చూసేందుకు ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అప్పుడే పిల్లలకు కరోనా టీకా