ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ఏపీ రీసెంట్ వార్తలు

.

5pm top news
ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Jul 14, 2021, 5:01 PM IST

  • అమలుకు కమిటీ
    వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలుకు పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖ మంత్రులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. వారానికి ఒకసారైనా సమావేశమై పనుల పురోగతి పర్యవేక్షించాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొట్టేసిన హైకోర్టు
    సంగం డెయిరీ (sangam dairy) ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్(dhoolipalla narendrakumar) బెయిల్(bail) రద్దు చేయాలని... ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటీషన్​ను హైకోర్టు (high court) కొట్టివేసింది. బెయిల్ రద్దు చేసేందుకు సహేతుకమైన కారణాలు లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పరిష్కారం ఆలస్యమే..!
    ఎల్‌ఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం అవుతోంది. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత దస్త్రాలను సరిచూసుకుని అధికారులు ఆమోదం తెలిపేందుకు చాలా సమయం పడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తీర్పు రిజర్వ్
    బ్రహ్మంగారి మఠం కేసులో హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. దివంగత మఠాధిపతి రెండో భార్య వేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఏజీ సాయం కోరిన సుప్రీం!
    ఐపీసీ సెక్షన్ 124ఏ కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై అటార్నీజనరల్ కేకే వేణుగోపాల్ సహాయం కోరింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ సెక్షన్​ చట్టబద్ధత భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందంటూ విశ్రాంత మేజర్ జనరల్ ఎస్​జీ వోంబట్‌కెరె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మరోసారి భారత్​-చైనా సైనికుల ఘర్షణ!
    తూర్పు లద్దాఖ్​లో చైనా సైన్యం మరోసారి దుస్సాహసానికి పాల్పడిందా? గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ(India China soldiers clash) జరిగిందా? కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ షేర్ చేసిన కథనంలో ఏముంది? దీనిపై ఇండియన్ ఆర్మీ ఏమంటోంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఉద్యోగులకు డీఏ పెంపు
    ఉద్యోగులకు డియర్​నెస్ అలవెన్స్​ (డీఏ) పెంపు, ఆయుష్​ మిషన్​ పొడగింపు వంటి పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్ వెల్లడించారు. కేబినెట్ తీసుకున్న మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అధికారపక్ష నేతగా గోయల్!
    కేంద్రమంత్రి పీయూష్ గోయల్​కు భాజపా అధిష్ఠానం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. రాజ్యసభలో భాజపాపక్ష నేతగా ఆయన్ను నియమించింది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐసీసీ కొత్త పాయింట్ల విధానం
    టెస్టు ఛాంపియన్ షిప్ (WTC 2023) రెండో ఎడిషన్​ కోసం కొత్త పాయింట్ల పద్ధతిని ప్రకటించింది ఐసీసీ. పర్సెంటేజ్ ఆఫ్​ పాయింట్ల ప్రకారం జట్లకు ర్యాంకులు కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హీరోయిన్​కు మగబిడ్డ..
    తనకు పుట్టిన చిన్నారి.. రెండు నెలల నుంచి ఐసీయూలోనే ఉన్నాడని హీరోయిన్ దియా మీర్జా వెల్లడించింది. ఆ విషయాన్నే చెబుతూ, ఇన్​స్టాలో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details