ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5pm

.

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5pm

By

Published : Oct 7, 2020, 5:01 PM IST

  • ఆర్టీసీ ఈడీల సమావేశం

హైదరాబాద్ బస్ భవన్‌లో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఈడీలు సమావేశమయ్యారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై చర్చించనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఎందుకెళ్లారు? ఏం చర్చించారు?'

సీఎం జగన్ తన కేసుల గురించే దిల్లీ వెళ్లారనే అనుమానాలు వస్తున్నాయని ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తరచుగా దిల్లీ వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'కానుక' పంపిణీకి సర్వం సిద్ధం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం రూపొందించిన ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని... కంకిపాడు మండలం పునాదిపాడు జడ్పీ పాఠశాలలో ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొనున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • బంతి.. బంతికీ బెట్టింగ్‌

క్రికెట్‌ అభిమానులను ఐపీఎల్‌ ఎంతవరకు అలరిస్తోందో తెలియదు కానీ.. పందేలు నిర్వహించే జూదరులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. బెట్టింగ్‌ కోసమే ఐపీఎల్‌ అనే స్థాయిలో బుకీలు భారీగా సంపాదిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • దారుణం...

దేశంలో మరో మూడు అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. రాజస్థాన్​లోని 15 ఏళ్ల బాలికపై ఓ కిరాతుకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. మధ్యప్రదేశ్​లోనూ రెండేళ్ల చిన్నారిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి ప్రయత్నించగా.. తల్లి రాకతో పరారయ్యారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • భారీ అగ్ని ప్రమాదం

ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్​లో రాజ్​భవన్ సమీపంలోని ఓ పెట్రోల్​ బంకులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పరిశోధనకు గౌరవం

జీనోమ్​ ఎడిటింగ్​ను అభివృద్ధి చేసిన ఇమ్మాన్యుయెల్​ చార్​పెంటియర్​, జెన్నిఫర్​ ఏ డౌడ్నలకు రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్​ పురస్కారం లభించింది. వీరికి.. బంగారు పతకంతో పాటు 1.1 మిలియన్​ డాలర్ల నగదు బహుమతి అందించనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఐదో రోజూ అదే జోరు

సెషన్ ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. వరుసగా ఐదో రోజూ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 304 పాయింట్లు బలపడి.. 39,900కి చేరువైంది. నిఫ్టీ 76 పాయింట్లు పెరిగింది. రిలయన్స్, టీసీఎస్​ సహా ఇతర హెవీ వెయిట్ షేర్లు బుధవారం లాభాలకు దన్నుగా నిలిచాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'కేఎల్​ రాహుల్​ కాదు పంత్​ సరైనోడు'

భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్​మన్​గా పంత్ సరైన వ్యక్తి అని దిగ్గజ లారా చెప్పాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్​పై పూర్తిగా దృష్టి పెట్టాలని తెలిపాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'నివేదికపై అనుమానాలు'

సుశాంత్​ శవపరీక్షపై ఎయిమ్స్​ ఇచ్చిన నివేదికపై తమకు అనుమానులున్నాయని సుశాంత్​ కుటుంబసభ్యుల తరపు న్యాయవాదుల బృందం అభిప్రాయపడింది. ఈ బృందానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది వరుణ్​సింగ్​.. ఇదే విషయమై సీబీఐ డైరెక్టర్​ రిషీ కుమార్​కు లేఖ రాశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details