- 'విశాఖలో హైఎండ్ ఐటీ స్కిల్ వర్సిటీ'
2020-2023 పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అచ్చెన్న అరెస్టు ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిదర్శనం'
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని బలవంతంగా జైలుకు తరలించడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. అచ్చెన్న అరెస్టు విషయం ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిదర్శనం అని వారు మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై మూడో విడత విచారణ
ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై మండలి ఛైర్మన్ వద్ద మూడో విడత విచారణ జరిగింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీత అనర్హత పిటిషన్‌పై ఆన్‌లైన్‌లో మండలి ఛైర్మన్ షరీఫ్ విచారణ చేపట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- గ్రామ వాలంటీర్‌పై దాడి
కడపజిల్లా పులివెందులలో పనిచేస్తున్న గ్రామ వాలంటీర్‌పై వైకాపా నాయకుడు దాడి చేశారు. పింఛను పంపిణీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'విదేశీ తబ్లీగీలకు ఉత్తర్వులు '
తబ్లీగీ జమాత్ కార్యకలాపాల్లో పాల్గొన్న 2,500 మందికిపైగా విదేశీయుల వీసాల రద్దు, 10 ఏళ్లపాటు నిషేధంపై వ్యక్తిగతంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు సుప్రీం కోర్టుకు తెలిపింది కేంద్రం. క్రిమినల్ అభియోగాలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుగుతున్నందున ఎవరూ స్వదేశానికి వెళ్లలేదని వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- తెల్లకోటు వీరులు