- మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
అట్టడుగు వర్గాలకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ.15వేల 735 కోట్లు, ఎస్టీలకు రూ.5,177 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా మొత్తంగా దాదాపు 1.02 కోట్ల మందికి లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ఇంత నిర్లక్ష్యమా ?
కరోనా అనుమానితులందరినీ ఒకే అంబులెన్స్‌లో కుక్కి కుక్కి ఎక్కించడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. కరోనా కేసులు పెరుగుతున్నా ఇంత నిర్లక్ష్యమా అని ఆవేదన చెందారు. ప్రజలను కాపాడే విషయంలో ప్రభుత్వం విఫలమవుతుందని విమర్శించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- మంత్రికి ఏ సంబంధమూ లేదు
తమిళనాడులో పట్టుబడిన నగదు మా వ్యాపార సంస్థదేనని... బంగారు వర్తకుడు నల్లమల్లి బాలు తెలిపాడు. అందరూ విమర్శిస్తున్నట్లు ఆ నగదుతో మంత్రి బాలినేనికి, రాజకీయ పార్టీలకు సంబంధం లేదని తెలిపాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 40 లక్షలు స్వాహా
బ్యాంకు అప్రైజర్.. బంగారం తనఖా పెట్టేటప్పుడు అది ఎంత బరువుంది..? అసలు బంగారమా..? నకిలీనా..? ఈ విషయాలను ధృవీకరించాల్సిన బాధ్యతను నిర్వహిస్తారు. దీనినే ఓ బ్యాంకుకు చెందిన అప్రైజర్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఐదుగురు సభ్యులతో కలిసి కుమ్మక్కయ్యాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- పట్టపగలే బ్యాంక్ దోపిడీ
పగటిపూట అందరూ చూస్తుండగానే ఇద్దరు దొంగలు ఓ బ్యాంకును లూఠీ చేసిన ఘటన నవీ ముంబయి కోపర్ ఖైరానే ప్రాంతంలో జరిగింది. మొత్తం 4.5 లక్షల రూపాయలను దోచుకెళ్లారు దుండగులు. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ప్రకృతికే కొత్త కళ
సాంకేతికత అద్భుతాలు సృష్టించగలదేమో కానీ... ప్రకృతి అందాన్ని పెంచగలదా? ఇలాంటి ప్రశ్నే కర్ణాటకలోని ఓ ప్రకృతి ప్రేమికుడి మదిలో మెదిలింది. అందుకే, ప్రాణం లేని కాంక్రీటు, ఇనుప కడ్డీలతో వంతెనలు కట్టడమెందుకని.. జీవ కళ ఉట్టిపడే వెదురు వంతెనలు నిర్మిస్తున్నాడు. పూర్వకాలం నాటి వంతెనలనూ పునర్ నిర్మిస్తున్నాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- రిలయన్స్ దూకుడు- సెన్సెక్స్ 458+
హెవీ వెయిట్ షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 548 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 188 పాయింట్లు పుంజుకుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- హ్యాక్ వెనుక ఎన్నికల కుట్ర?
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు ఊహించని షాకిచ్చారు సైబర్ నేరగాళ్లు. అంతర్జాతీయ ప్రముఖులు, సంపన్నులే లక్ష్యంగా హ్యాకర్లు ట్విట్టర్ ఖాతాలపై దాడి చేశారు. వారందరి అధికారిక ఖాతాలలో క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌కు సంబంధించిన పోస్టులు పెట్టారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- మేం ఎప్పుడో సిద్ధం
ఐపీఎల్ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు దుబాయ్ స్పోర్ట్స్ సిటీస్ హెడ్ ఆఫ్ క్రికెట్ అండ్ ఈవెంట్స్ సల్మాన్ హనీఫ్ తెలిపారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ మ్యాచ్‌లు జరిగేలా స్టేడియంలో చాలినన్ని పిచ్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'భగవద్గీత సాక్షిగా' అంటోన్న సాయితేజ్!
మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ వరుస చిత్రాలు ఓకే చేస్తూ జోరు చూపిస్తున్నాడు. తాజాగా ఈ హీరో మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి