తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకిందనీరులా విస్తరిస్తోంది. సోమవారం రాత్రి 8 గంటల వరకు 1,22,143 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 5,926 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,61,359కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో 18 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,856కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,209 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 3,16,656కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న 793 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కల్లోలం- కొత్తగా 5,926 కేసులు, 18 మరణాలు - telangana corona latest news
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకిందనీరులా విస్తరిస్తోంది. తాజాగా 5,926 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 18 మంది మృతి చెందారు.
corona cases in telangana