కేంద్ర ఆర్థికశాఖ 15వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ స్థానిక సంస్థలకు మంగళవారం రూ.13,385.70 కోట్ల టైడ్ గ్రాంట్ విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలివాయిదా కింద ఈ మొత్తాన్ని ఇచ్చింది. ఇందులో తెలంగాణకు రూ.409.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.581.7 కోట్లు దక్కాయి. ఈ మొత్తాన్ని స్థానిక సంస్థలు తాగునీటి సరఫరా, వాననీటి సంరక్షణ, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్మాణానికి ఉపయోగించాల్సి ఉంటుంది. కేంద్రప్రాయోజిత పథకాల కింద కేంద్రం తాగునీరు, పారిశుద్ధ్యం కోసం విడుదల చేసే నిధులకు అదనంగా ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు పేర్కొంది. ఈ మొత్తం అందిన పదిరోజుల్లోపు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని స్థానిక సంస్థల ఖాతాలకు బదిలీచేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ అంతకుమించి జాప్యమయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కాలానికి వడ్డీ చెల్లిస్తూ నిధులు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.
స్థానిక సంస్థలకు రూ.581 కోట్లు
దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ స్థానిక సంస్థలకు .. 15వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు కేంద్రం టైడ్ గ్రాంట్ విడుదల చేసింది. రాష్ట్రానికి రూ.581.7 కోట్లు దక్కాయి.
581 crore to AP local bodies