మూడో దశ ఎన్నికలకు సంబంధించి 579 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. గుంటూరు జిల్లాలో 98, చిత్తూరులో 91, నెల్లూరులో 75, ప్రకాశంలో 62, కడపలో 59, శ్రీకాకుళంలో 45, విజయనగరంలో 37, కృష్ణాలో 29, కర్నూలులో 26, అనంతపురంలో 23, ఉభయ గోదావరి జిల్లాల్లో చెరో 14, విశాఖపట్నం జిల్లాలో 6 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు వివరించారు. మిగిలిన 2,640 స్థానాలకు ఈ నెల 17న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 7,756 మంది పోటీ పడుతున్నారు. ఇదే దశలో 31,516 వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో 11,732 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 19,784 స్థానాలకు 43,282 మంది పోటీలో ఉన్నారు.
నాలుగో దశకు 1,08,441 నామినేషన్లు