corona cases: రాష్ట్రంలో కొత్తగా 5,741 కరోనా కేసులు, 53 మరణాలు - corona latest updates
17:32 June 15
కరోనా నుంచి కోలుకున్న మరో 10,567 మంది బాధితులు
రాష్ట్రంలో కొత్తగా 5 వేల 741 కరోనా కేసులు నమోదయ్యాయి. 96 వేల 153 శాంపిల్స్ పరీక్షించగా.. ఈమేరకు కేసులు రికార్డయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 831 కేసులు రాగా, చిత్తూరు జిల్లాలో 830, పశ్చిమగోదావరిలో 703, అనంతపురం జిల్లాలో 353, కడప 325, గుంటూరు 385, కృష్ణా జిల్లాలో463, కర్నూలులో 130, నెల్లూరులో 266, ప్రకాశం జిల్లాలో463, శ్రీకాకుళం జిల్లాలో428, విశాఖలో339, విజయనగరం జిల్లాలో 225 మందికి కరోనా సోకినట్టు ప్రభుత్వం తెలిపింది. వైరస్ కాటుకు మరో 53 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 12 మంది చనిపోగా, తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి మరో 10వేల 567 మంది కోలుకోగా.. ప్రస్తుతం 75 వేల 134 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
ఇదీ చదవండి: