రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 534 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో మహమ్మారితో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు బాధితుల సంఖ్య 8 లక్షల 77 వేల 348 కి చేరగా.. 7 వేల 69 మంది వైరస్ సోకి మరణించారు. కరోనా నుంచి 498 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8.65లక్షలకు చేరింది. ప్రస్తుతం 4 వేల 4 వందల 54 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 63 వేల 8 వందల 21 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా..మొత్తం పరీక్షల సంఖ్య కోటీ పదిలక్షలు దాటాయి.
కరోనాతో మరణించిన వారిలో అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.