రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 51 ఇంజినీరింగ్, బీఫార్మసీ కళాశాలలు మూతపడనున్నాయి. మరో రెండు ఇంజినీరింగ్ కళాశాలలపై జేఎన్టీయూ-(కాకినాడ) తుది నిర్ణయం తీసుకోలేదు. కళాశాలల్లో మౌలికవసతులు, అనుమతుల పై అనంతపురం, కాకినాడ జేఎన్టీయూ పాలకవర్గాలు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తగ్గనున్న 1700 సీట్లు..
జేఎన్‌టీయూ-కాకినాడ పరిధిలో 26 ఇంజినీరింగ్, 2 బీఫార్మసీ కళాశాలలు ఈ ఏడాది మూతపడనున్నాయి. మరో రెండు కళాశాలలపై నిర్ణయం పెడింగ్‌లో ఉంది. నిబంధనల మేరకులేని 45ఇంజినీరింగ్ కాలేజీల్లో 4800 సీట్లు తగ్గించారు. మూతపడే కళాశాలలతో కలిపి.. కాకినాడ జేఎన్టీయూ పరిధిలో 12,600 సీట్ల వరకు తగ్గనున్నాయి. అనంతపురం-జేఎన్ట్టీయూ పరిధిలో.. 23 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులు నిలిపివేయనున్నారు. 17కళాశాలల సీట్లలో కోత విధించారు. అనంతపురం-జేఎన్టీయూ పరిధిలో 41వేల ఇంజినీరింగ్ సీట్లు ఉండగా.. ఈసారి 5,100 సీట్లు తగనున్నాయి. మొత్తం అన్ని కలిపి రాష్ట్రంలో ఈ ఏడాది 17,00 వరకూ సీట్లు తగనున్నాయి.