ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ముఖ్యమంత్రి జగన్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కిషన్‌రెడ్డి కలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'త్యాగ నిరతికి ప్రతీక మొహర్రం'
మొహర్రం త్యాగ నిరతికి ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తన జీవితాన్ని త్యాగం చేసిన పవిత్ర ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ వంటి అమర వీరులను మొహర్రం గుర్తు చేస్తుందన్నారు. మంచితనం, త్యాగం ఇస్లాం సూత్రాలు కాగా మానవతావాదాన్ని వెలువరించే మొహర్రం స్ఫూర్తిని అనుసరించాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దాడులు చేస్తే తప్ప వ్యవహారం తెలియలేదా?: సీఎం
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తే తప్ప నకిలీ చలానాల వ్యవహారం తెలియలేదా?.. అసలు నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. ఇంత పెద్ద స్థాయిలో తప్పులు జరిగినా ఎందుకు తెలియలేదని నిలదీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆదుకోండి'
కరోనా మిగిల్చిన నష్టం కారణంగా ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రపతికి శస్త్రచికిత్స
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు గురువారం ఉదయం కంటి ఆపరేషన్ (క్యాటరాక్ట్ సర్జరీ) జరిగింది. ఈ మేరకు శస్త్రచికిత్స విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదలచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జవాను వీరమరణం