- సునీల్ యాదవ్ రిమాండ్ పొడిగింపు
వివేకా హత్య కేసు నిందితుడు సునీల్‌యాదవ్ రిమాండ్ సెప్టెంబరు 1 వరకు పొడిగిస్తూ.. జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. సునీల్‌కు నార్కో పరీక్షలకు అనుమతివ్వాలని రెండు రోజుల కిందట కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హైకోర్టు ఆగ్రహం
దివ్యాంగుల పింఛన్ నిలిపివేశారన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పింఛన్ నిలిపివేసే నాటికి పిటిషనర్‌కు రేషన్‌కార్డు లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించగా..హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పింఛన్ కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వైకాపా నేతలపై చర్యలు తీసుకోండి'
తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడి చేసి, కులం పేరుతో దూషించిన వైకాపా నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే నాగార్జున, పానుగంటి చైతన్యతోపాటు మరో 50 మందిపై గుంటూరు తూర్పు డీఎస్పీ సీతారామయ్యకి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జాబితా విడుదల
ఏపీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్-2 లోని కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు సహకార శాఖ కమిషనర్ ప్రకటన జారీ చేశారు. apcooperation.nic.in వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను పొందుపరిచామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మహిళలను అనుమతించాల్సిందే'
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) పరీక్షకు మహిళలను అనుమతించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. పరీక్షకు మహిళలను అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కేంద్రం కీలక నిర్ణయం