రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్ కేసులు..ఐదుగురు మృతి - corona cases in india
11:56 June 21
రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్ కేసులు..ఐదుగురు మృతి
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం 477 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8929 కి చేరింది.
ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో రాష్ట్రానికి చెందివారు 7059 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 1540 మంది. ఇక విదేశాల నుంచి ఏపీకి వచ్చినవారిలో 330 మంది కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఐదు మంది మృతి చెందగా...రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ సంఖ్య 106కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,307గా ఉంది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 4,516 మంది చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి:
సూర్యగ్రహణం: వేదమంత్రాలతో ప్రతిధ్వనించిన తిరుమల క్షేత్రం