Corona cases: రాష్ట్రంలో కొత్తగా 4,684 కరోనా కేసులు, 36 మరణాలు - ap corona latest updates

16:32 June 23
రాష్ట్రంలో కొత్తగా 4,684 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 80,712 పరీక్షలు నిర్వహించగా.. 4,684 కేసులు నిర్ధరణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,62,036 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 36 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 12,452కి చేరింది. 24 గంటల వ్యవధిలో 7,324 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,98,380కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 51,204 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,13,61,014 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
ఇదీ చదవండి: