రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 465 కరోనా పాజిటివ్ కేసులు - రాష్ట్రంలో కరోనా కేసులు
09:48 June 19
రాష్ట్రంలో మరో 465 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో రోజురోజుకూ రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 465 కరోనా కేసులు నమోదు కావటంతో మొత్తం కేసుల సంఖ్య 7 వేల 961కి చేరింది. ఒకరోజు వ్యవధిలో 17 వేల 609 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా... స్థానికంగా ఉంటున్న 376 మందికి కొత్తగా కరోనా సోకినట్లు నిర్ధరించారు. విదేశాల నుంచి వచ్చిన 19 మందికి తాజాగా పాజిటివ్‌గా తేలగా.... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 70 మంది కొత్తగా కొవిడ్ బారిన పడ్డారు.
కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తంగా నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 96కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 3 వేల 960 మంది చికిత్స పొందుతున్నారు.