తెలంగాణలో కొత్తగా 431 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,04,298కు చేరింది. వైరస్‌తో తాజాగా ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1076కి పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 228 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 2, 99, 270 వైరస్ నుంచి బయటపడ్డారు.
తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు - తెలంగాణలో కొత్త కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 431 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,04,298కు చేరింది.
telangana covid
రాష్ట్రంలో ప్రస్తుతం 3,352 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,395 మంది బాధితులు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 111 కరోనా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా జీహెచ్‌ఎంసీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నిన్న 70,280 మందికి కరోనా పరీక్షలు చేశారు.
ఇదీ చూడండి:ప్యాకేజీ అంగీకరించడం లేదు: వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి