అమరావతిని, విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలంటూ రైతులు, మహిళలు అమరావతిలో 425వ రోజు నిరసన దీక్షలు కొనసాగించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వారికి మద్దతు తెలుపుతూ అమరావతి రైతులు రేపు అక్కడికి బయలుదేరి వెళ్లనున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి నుంచి మూడు బస్సుల్లో వందమంది రైతులు, మహిళలు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సడలని సంకల్పం... కొనసాగుతున్న అమరావతి ఉద్యమం
అమరావతిని, విశాఖ ఉక్కు పరిశ్రమను రక్షించుకుందామంటూ... అమరావతిలో రైతులు, మహిళలు 425వ రోజు నిరసన దీక్షలు కొనసాగించారు. విశాఖ వాసులకు మద్దతుగా అమరావతి రైతులు రేపు అక్కడికి వెళ్లనున్నారు.
నిరసన దీక్షలు
మందడంలో మహిళలు ఏప్రిల్ 21న భద్రాచలంలో జరగనున్న సీతారాముల కల్యాణ తలంబ్రాలకి కోటి వడ్ల గింజలను చేతితో ఒలిచారు. జై అమరావతి, విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ తలంబ్రాలు సిద్ధం చేశారు. రెండేళ్ల క్రితం పుల్వామా దాడిలో మృతి చెందిన సైనికల కోసం అబ్బరాజుపాలెంలో రైతులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఇదీ చదవండి:ప్రశాంతంగా ఉన్న విశాఖలో ప్రశాంతత లేకుండా చేశారు: లోకేశ్