రాష్ట్రంలో మరోసారి కరోనా మహమ్మారి కోరలు చాచింది. ఒక్కరోజు వ్యవధిలోనే వైరస్ వల్ల 18 మంది చనిపోయారు. నెల్లూరు జిల్లాలో నలుగురు.. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. విశాఖలో ఇద్దరు ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో కొత్తగా 4,157 మందికి కరోనా సోకింది.
రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 4,157 కేసులు, 18 మరణాలు - ఏపీలో కరోనా మరణాలు
16:18 April 14
రాష్ట్రంలో కొత్తగా 4,157 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన ఒక్కరోజు వ్యవధిలోనే 18 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 1606 మంది కోలుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఒక్కరోజు వ్యవధిలో 35,732మంది నమునాలు పరీక్షించగా.. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 617 మంది వైరస్ బారిన పడ్డారు. చిత్తూరు జిల్లాలో 517, శ్రీకాకుళం జిల్లాలో 522, గుంటూరు జిల్లాలో 434, విశాఖ జిల్లాలో 417 మందికి కొవిడ్ ఉన్నట్లు తేలింది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 60 మందికి మాత్రమే కొత్తగా వైరస్ సోకిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో 1606 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇదీ చదవండి