లాక్డౌన్ సడలింపులతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,468 అధికారిక మద్యం దుకాణాలకు గాను 2,345 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 411 మద్యం దుకాణాలు అమ్మకాలు ప్రారంభించాయి. ప్రకాశం జిల్లాలో మాత్రం ఒక్క దుకాణం తెరుచుకోలేదు. మద్యం డిపోలు కంటైన్మెంట్ జోన్లో ఉండటంతో మద్యం సరఫరాను అధికారులు నిలిపివేశారు. మందు బాబులు పోటెత్తడంతో తొలిరోజు 60 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం.
మద్యం విక్రయాల తొలిరోజు ఆదాయమెంతంటే..? - ఏపీలో మద్యం అమ్మకాలు
రాష్ట్రంలో సోమవారం మద్యం ఏరులై పారింది. లాక్డౌన్ కారణంగా చాలా రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరుచుకోవటంతో మందు బాబులు పోటెత్తారు. ప్రతి దుకాణం వద్ద జాతర వాతావరణం కనిపించింది. మద్యంతో నాలుక తడుపుకునేందుకు జల్సా బాబులు పోటీ పడ్డారు. ఫలితంగా తొలిరోజు భారీగా మద్యం విక్రయాలు జరిగాయి.
40 crores worth of liquor was sold in first in ap