ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YS Jagan prajasankalpa yatra: ప్రజా సంకల్పయాత్రకు నేటితో నాలుగేళ్లు - ప్రజా సంకల్పయాత్రకు నేటితో నాలుగేళ్లు

ప్రతిపక్ష నేత హోదాలో.. ఇప్పటి సీఎం జగన్ రెడ్డి 2017 నవంబరు 6న ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. 134 అసెంబ్లీ నియోజ కవర్గాల్లో 2,516 గ్రామాల మీదుగా సాగిన ఈ యాత్రలో ఇచ్చిన హామీలనే అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది.

4-years-to-ys-jagan-mohan-reddy-prajasankalpa-yatra
ప్రజా సంకల్పయాత్రకు నేటితో నాలుగేళ్లు

By

Published : Nov 6, 2021, 7:20 AM IST

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు శనివారంతో నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ యాత్రలో ఇచ్చిన హామీలనే అధికారంలోకొచ్చాక అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది. పాదయాత్ర అప్పట్లో కొనసాగిన తీరునూ గుర్తు చేసింది.

‘2017 నవంబరు 6న ఇడుపులపాయ నుంచి చేపట్టిన పాదయాత్ర 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగిసింది. సుమారు 14నెలలపాటు సాగిన యాత్రలో ఆయన 3,648 కి.మీ.లు నడిచారు. పాదయాత్రలో భాగంగా 124 సభలు సమావేశాలు, 55 ఆత్మీయ సమావేశాల్లో ప్రజలతో మమేకమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలను స్వయంగా చూసేందుకు అప్పట్లో పాదయాత్ర చేపట్టారు. 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,516 గ్రామాల మీదుగా యాత్ర సాగింది.

పాదయాత్రలో గమనించిన ప్రజాసమస్యలకు పరిష్కారాన్ని చూపేలా అధికారంలోకొచ్చాక పాలన అందిస్తామంటూ అప్పట్లో హామీనిచ్చారు. గ్రామంలోనే ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనను పాదయాత్రలోనే జగన్‌ వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక దానికనుగుణంగా గ్రామసచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలను తీసుకువస్తామని పాదయాత్రలో చెప్పినట్లు వాలంటీరు వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. ఇలాంటి వ్యవస్థల అంకురార్పణ ఆలోచనకు పాదయాత్రలోనే నాంది పడింది. గ్రామసచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇవి గ్రామాలకు ఆస్తులుగా మారుతున్నాయి. యాత్ర సృష్టించిన సంచలనంతో 2019 ఎన్నికల్లో జగన్‌ చరిత్రాత్మక విజయాన్ని సాధించారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి మేనిఫెస్టోలోని హామీలను అమలు చేస్తున్నారు’ అని పేర్కొంది.

ఇదీ చూడండి:

Godavari rever: గోదా'వరి'కి కోత.. రబీపై జలవనరుల శాఖ నివేదిక

ABOUT THE AUTHOR

...view details