రాష్ట్రానికి కేంద్రం 4.99 లక్షల కొవిడ్ డోసులు ఇచ్చిందని రాష్ట్ర వైద్యశాఖ తెలిపింది. 4.77 లక్షల సీరం వ్యాక్సిన్ డోసులు గన్నవరం వచ్చాయని వెల్లడించింది. బుధవారం భారత్ బయోటెక్ నుంచి 20 వేల డోసులు వస్తాయని పేర్కొంది. పుదుచ్చేరికి 320 వ్యాక్సిన్ డోసులు కేటాయించారని తెలిపింది. గన్నవరం నుంచి విశాఖ, గుంటూరు, కర్నూలు, కడప పంపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వివరించింది. ప్రాంతీయ కేంద్రాల నుంచి 13 జిల్లాల్లోని వ్యాక్సిన్ కేంద్రాలకు చేరుస్తామని వెల్లడించింది.
కేంద్రం నుంచి రాష్ట్రానికి 4.99 లక్షల కొవిడ్ డోసులు : వైద్యారోగ్యశాఖ - covaxin latest news
ఏపీకి కేంద్రం 4.99 లక్షల కొవిడ్ డోసులు ఇచ్చిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. వీటిని గన్నవరం నుంచి విశాఖ, గుంటూరు, కర్నూలు, కడపకు పంపేందుకు ఏర్పాట్లను చేశామని వెల్లడించింది.
కొవిడ్ డోసులు