ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసులకు చిక్కిన.. లెక్కల్లేని రూ.4 కోట్లు..! - 4 crore seized in car

తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల(Money Seized News)లో భారీ ఎత్తున నగదు పోలీసులకు పట్టుబడింది. స్వాధీనమైంది. మంగళవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో లెక్కలు చూపని రూ. 4 కోట్లను పోలీసులు గుర్తించారు.

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో భారీగా నగదు పట్టివేత
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో భారీగా నగదు పట్టివేత

By

Published : Oct 20, 2021, 4:29 PM IST

తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల(Money Seized News)లో భారీ ఎత్తున నగదు పోలీసుల స్వాధీనమైంది. మంగళవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో లెక్కలు చూపని రూ.4 కోట్లను పోలీసులు పట్టుకున్నారు.

చిట్యాలలో మంగళవారం రాత్రివేళ పోలీసులు తనిఖీలు(Money Seized News) నిర్వహిస్తున్న సమయంలో.. హైదరాబాద్​ నుంచి ఓ కారు వచ్చింది. ఆ కారును ఆపిన పోలీసులు తనిఖీ చేయగా.. ఏకంగా రూ.4కోట్లు లభించాయి.

కారులోని ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ నగదు ఎక్కడిదని ప్రశ్నించగా.. సరైన ఆధారాలు చూపించలేదని సమాచారం. దీంతో.. పోలీసులు ఆ డబ్బును (Money Seized News) స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు ఎక్కడిదనే విషయంపై వారిని ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి:Chandrababu: వైకాపా దాడులకు వ్యతిరేకంగా చంద్రబాబు దీక్షాస్త్రం

ABOUT THE AUTHOR

...view details