సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఏపీ పోలీసుశాఖకు నాలుగు అవార్డులు దక్కాయి. దిశ యాప్, దిశ క్రైమ్‌సీన్ మేనేజ్‌మెంట్, సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టంకు అవార్డులు దక్కాయి. డిజిటల్ టెక్నాలజీ సభ అందించే ఈ అవార్డులను డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం ఆన్‌లైన్ వేదికగా స్వీకరించారు.
డిజిటల్ టెక్నాలజీ సభ మొత్తం 12 అవార్డులు ప్రకటించగా.. అందులో నాలుగు ఏపీ పోలీసు శాఖకే దక్కాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సత్వరన్యాయం, మెరుగైన సేవలు అందిస్తున్న సిబ్బందిని సీఎం జగన్, హోం మంత్రి మేకతోటి సుచరిత అభినందించినట్లు పోలీసు శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.