ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హిజ్రాపై దౌర్జన్యం.. వద్దన్నందుకు స్నేహితుడిని కడతేర్చారు..! - old city murder case

Murder Accused Arrest: ఈనెల హైదరాబాద్​ పాతబస్తీలో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఓ హిజ్రాపై దౌర్జన్యం చేస్తుంటే స్నేహితులను వద్దని వారించటమేనని ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు వెల్లడించారు.

Murder Accused Arrest
హత్య కేసులో నిందితుల అరెస్ట్

By

Published : Jun 9, 2022, 6:09 PM IST

Murder Accused Arrest: హిజ్రాలపై దౌర్జన్యం చేస్తుంటే అడ్డుకున్నందుకు గానూ.. స్నేహితుడని కూడా చూడకుండా విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో ఈ నెల 5 తేదీన ఈ హత్య జరిగింది. కాగా.. మృతునితో పాటు దాడికి గురైన మరో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులందరూ డ్రైవర్లే కాక.. స్నేహితులు కూడా!

ఈనెల 4 (హత్యకు ఒక రోజు ముందు)న అత్తాపూర్ సమీపంలో వహీద్, అమీర్, షోయబ్, యూసుఫ్ అనే నలుగురు ఆటో డ్రైవర్లు కలిసి ఓ ట్రాన్స్​జెండర్ నుంచి బలవంతంగా డబ్బులు లాక్కునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో వాళ్ల ఇంకో స్నేహితుడు అర్షద్.. వాళ్లను అడ్డుకున్నాడు. హిజ్రాను ఇబ్బందిపెట్టొద్దని వదిలేయమని.. ఇలాంటి పనులు చేయొద్దని వారించాడు. హిజ్రాకు మద్దతుగా మాట్లాడినందుకు గానూ.. అర్షద్​తో మిగతా స్నేహితులు గొడవపడ్డారు.

అనంతరం.. వాళ్ల మధ్య జరిగిన గొడవను కాంప్రమైజ్ చేసుకుందామని మరుసటి రోజు సాయంత్రం అర్షద్​ను పాతబస్తీలోని కిషన్​బాగ్​ ప్రాంతానికి పిలిచారు. స్నేహితులు పిలుపును కాదనకుండా.. అర్షద్​ తన బంధువుతో కలిసి అక్కడి వెళ్లాడు. మాట్లాడుకునే సమయంలో.. స్నేహితుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగటంతో.. ఘర్షణ పెరిగింది. ఈ క్రమంలో.. షోయబ్ అనే యువకుడు తన దగ్గరున్న కత్తితో అర్షద్​పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డుకునేందుకు వెళ్లిన అర్షద్​ బంధువు తలపై బీరు సీసాతో కొట్టారు. ఈ క్రమంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. నిందితులు అక్కడి నుంచి ఆటోలో పరారయ్యారు. స్థానికుల సమాచారంతో.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

తీవ్రంగా గాయపడిన అర్షద్ ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఇంకో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. క్షతగాత్రుని ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కాంప్రమైజ్ వ్యవహారంలో ఓ మహిళకు పరోక్షంగా ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. సదరు మహిళ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details