ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @3 pm

.

ప్రధాన వార్తలు @3pm
ప్రధాన వార్తలు @3pm

By

Published : Nov 8, 2020, 2:59 PM IST

  • అధ్యక్షుడిగా బైడెన్​ తొలి సంతకం దేనిపై?
    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్​ ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన పోరులో ట్రంప్​పై విజయదుందుబి మోగించారు. సర్వేల అంచనాలు నిజం చేస్తూ తొలిసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే వైట్​హౌస్​లో అడుగుపెడుతున్న బైడెన్​.. తొలి సంతకం దేని మీద చేయనున్నారు? 100 రోజుల ప్రణాళిక ఎలా ఉంటుంది? కీలక నిర్ణయాలు ఏంటి? అనే అంశాలను ఓసారి పరిశీలిద్దాం.
  • ఓటమికి ముందు ట్రంప్‌ ఏం చేశారంటే...
    సాధారణంగా ట్విట్టర్‌లో చురుగ్గా ఉండే ట్రంప్‌.. కీలక సమయంలో స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ఎప్పుడూ అని ఆలోచిస్తున్నారా? అధ్యక్ష ఎన్నికల ఫలితం వెలువడే సమయంలో ఆయన అదృశ్యమయ్యారు. మరి ఆ సమయంలో ట్రంప్​ ఏం చేశారు? వివరాలకు క్లిక్ చేయండి
  • సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేను: ఏజీ కె.కె.వేణుగోపాల్
    సీఎం జగన్‌పై కోర్టు ధిక్కరణ అంశంలో...న్యాయవాది అశ్వినీకుమార్‌ లేఖపై ఏజీ కె.కె.వేణుగోపాల్‌ మరోసారి స్పందించారు. ఈ అంశం సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేనంటూ పునరుద్ఘాటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • వడివడిగా కసరత్తు... కొత్త జిల్లాల ఏర్పాటుకు అడుగులు
    కాకినాడ కేంద్రంగా ఇప్పుడున్న తూర్పు గోదావరి జిల్లా భవిష్యత్తులో మూడు జిల్లాలుగా మారనుంది. ప్రజలకు సమర్థంగా సేవలు అందాలి... ప్రగతి పర్యవేక్షణ పక్కాగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • అన్ని రంగాల్లో మహిళలకే అధిక ప్రాధాన్యం: హోంమంత్రి సుచరిత
    వైకాపా ప్రభుత్వం మహిళలకే అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యమిస్తోందని... హోంమంత్రి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లాలోని లక్ష్మీపురంలో వైకాపా నాయకురాలు రోజారాణి ఆధ్వర్యంలో చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీని సుచరిత ప్రారంభించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధిని పాతాళంలోకి తొక్కారు: భాజపా
    ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర అభివృద్ధిని పాతాళంలోకి తొక్కారని... భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా... రాష్ట్ర అభివృద్ధి శూన్యమన్నారు. ఇసుకపై జీవోలు నాలుగుసార్లు మార్చారని, మద్యం ధరలు పెంచారని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఎనిమిదో విడత చర్చల్లోనూ పురోగతి శూన్యం!
    చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరిపిన ఎనిమిదో విడత చర్చల్లోనూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇరు దేశాల మధ్య శుక్రవారం జరిగిన చర్చల్లో.. సరిహద్దు ఉద్రిక్తతలపై నిర్మాణాత్మకంగా, లోతుగా సమాలోచనలు చేసినట్లు తాజాగా స్పష్టం చేసింది భారత సైన్యం.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • గుజరాత్​లో రోపాక్స్ సేవలు ప్రారంభించిన ప్రధాని
    గుజరాత్​లో రోపాక్స్ ఫెర్రీ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరును ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖగా మార్చినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'సన్​రైజర్స్ ప్రమాదకారి.. అయినా మేమే గెలుస్తాం'
    క్వాలిఫయర్ రెండో మ్యాచ్​కు సిద్ధమైన దిల్లీ ఆల్​రౌండర్ స్టోయినిస్.. ఇందులో తమ జట్టు విజయం సాధిస్తుందని చెప్పాడు. ట్రోఫీ సాధించాలన్న లక్ష్యమే తనకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • నాన్న నిన్ను కాపాడుకోలేకపోయాను: రాయ్​లక్ష్మీ
    అనారోగ్య కారణాలతో మృతిచెందిన తన తండ్రికి బరువెక్కిన హృదయంతో భావోద్వేగపూరితమైన ట్వీట్​ చేశారు నటి రాయ్​ లక్ష్మీ. తండ్రితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details