మార్కాపురంలో గత నాలుగు రోజులుగా బయోమెట్రిక్ కోసం చిన్నారులతో వారి కుటుంబ సభ్యులు వచ్చి వెళుతున్నారు. అయినా పని కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఏదోఒక పరిష్కారం చేయండి మహాప్రభో అంటూ వేడుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నాడు-నేడులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలన్నీ మారుస్తామని ప్రభుత్వ పెద్దలు గర్వంగా చెబుతున్నా.. పలుచోట్ల విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. అనేకచోట్ల చిన్నపాటి వర్షాలకే పాఠశాల ప్రాంగణంలో నీళ్లు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. ఆ నీళ్లలోనే నడుచుకుంటూ తరగతులకు హాజరుకావాల్సి వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహంలో లోకాయుక్త కార్యాలయం ప్రారంభమైంది. లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి..కార్యాలయాన్ని ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కుటుంబ సభ్యుల మధ్య జరిగే చిన్నచిన్న గొడవలు ఓ ప్రాణం పోయేందుకు కారణమయ్యాయి. కలిసిమెలిసి ఉండాల్సిన అన్నదమ్ములే తరచూ గొడవలు పడుతూ.. చివరకు ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున సోదరుల మధ్య జరిగిన గొడవలో.. తమ్ముడు అన్నను గడ్డపారతో పొడిచి చంపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మైసూరులో కళాశాల విద్యార్థిని గ్యాంగ్ రేప్ చేసిన వారిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఓ రైతుకు కాసుల పంట పండింది. రెండేళ్ల శ్రమకు ఫలితం దక్కింది. తన వ్యవసాయ భూమిలో సుమారు రూ.30 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది(farmer found diamond). మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో జరిగింది ఈ సంఘటన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాబుల్ విమానాశ్రయం వద్ద దాడితో(Kabul airport blast) సర్వత్రా చర్చనీయాంశమైంది ఐసిస్-కే ఉగ్రసంస్థ(ISKP terrorist group). మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఐసిస్-కే ఉగ్ర ముఠాలో 14 మంది కేరళకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. జైళ్లలో ఉన్నవారందరినీ తాలిబన్లు ఇటీవలే విడుదల చేసినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తాలిబన్లపై(Afhgan Taliban) తుపాకులతో గర్జించిన పంజ్‌షేర్ లోయలో(Panjshir Valley) ఇప్పుడు శాంతియుత వాతావరణం నెలకొంది. శుక్రవారం నుంచి అక్కడ ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు. అయితే ఇది తుపానుకు ముందు ఉండే ప్రశాంతతా? లేక శాంతికి సంకేతమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యువీకి హైకోర్టు హెచ్చరికలు
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh), తనపై పెట్టిన కేసులో సహకరించకుంటే అతడిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని పంజాబ్-హరియాణా న్యాయస్థానం హెచ్చరించింది. గతంలో ఓ సామాజిక వర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ గతేడాది యువీపై సామాజిక కార్యకర్త రజత్ కల్సన్ కేసు పెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' విడుదల తేదీని (most eligible bachelor release date) చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు హీరో విశాల్ తన కొత్త చిత్రంపై అప్డేట్ ఇచ్చారు. థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించిన తిమ్మరుసు, ఎస్ఆర్ కల్యాణ మండపం చిత్రాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.