- 'వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా.. కోవిడ్ పరీక్షా కేంద్రాలు'
కరోనా పరీక్షా కేంద్రాల వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ పరీక్షా కేంద్రాలు.. వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయని దుయ్యబట్టారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- హక్కు కేంద్రానికే ఉంది
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులకు ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే ఉందనే విషయాన్ని సీఎం తెలుసుకోవాలని తెదేపా నేత వర్ల రామయ్య హితవు పలికారు.ఈ విషయంలో పట్టుదలకు వెళ్లకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్నారు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- వ్యాట్ పెంచడం దారుణం
పెట్రోలు, డీజిల్‌పై అదనపు వ్యాట్ పెంచడాన్ని తెదేపా నేతలు తప్పుబట్టారు. వ్యాట్ పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ చౌదరి మృతి
గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ చౌదరి ఉదయం కన్నుమూశారు. ఆయన ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ పదవులు నిర్వహించారు. 1994 ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసిన ఆయన.. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- వీడని ఉత్కంఠ!
రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. స్పీకర్ నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలట్‌కు ఇచ్చిన గడువు ఈ సాయంత్రంతో ముగియనుంది. ఈ సమయంలోనే సచిన్ వేసిన పిటిషన్‌పై రాజస్థాన్ హైకోర్టులో నేడు మరోసారి విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- తల్లికి అంత్యక్రియలు జరిపి ఐదుగురు కుమారులు మృతి
కరోనా వైరస్ ఝార్ఖండ్‌కు చెందిన ఓ కుటుంబంలో తీరని విషాదం మిగిల్చింది. కేవలం 16 రోజుల్లో ఆ కుటుంబంలో ఆరుగురిని బలిగొంది. కొవిడ్ బారిన పడి మృతి చెందిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన ఐదుగురు తనయుల ప్రాణాలు తీసింది ఆ మహమ్మారి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ఒక్క రోజులో రూ.97 వేల కోట్లు ప్లస్
ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కేవలం ఒక్క రోజులో రికార్డు స్థాయిలో రూ.97 వేల కోట్లు గడించారు. అమెరికా మార్కెట్లలో సంస్థ షేర్లు సోమవారం భారీగా పుంజుకోవడం ఇందుకు కారణం. దీనితో బెజోస్ మొత్తం సంపద రూ.14 లక్షల కోట్లు దాటింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ఇదే అసలైన కాలాపానీ కథ!
కాలాపానీ, లింపియాధురా, లిపులేఖ్... భారత్-నేపాల్ మధ్య ఇటీవల వివాదం ప్రారంభమైనప్పుడు తెగ వినిపించిన పేర్లివి. భారత్ భూభాగంలోని ఈ ప్రాంతాలు మావేనంటూ నేపాల్ చేసిన రచ్చ ఇంతా అంతా కాదు. వీటిని తమ భూభాగంలో చూపించుకోవడానికి ఏకంగా తమ రాజ్యాంగాన్నే సవరించింది. మరి అసలు ఈ వివాదానికి మూలమేంటి? తన అధీనంలో లేకపోయినా దీనిపై హక్కులను ప్రకటించుకోవడానికి కారణమేంటి? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 3టీ క్రికెట్లో ఆడటం గర్వంగా ఉంది'
దక్షిణాఫ్రికాలో కరోనా తర్వాత 3టీ క్రికెట్ పునః ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత మళ్లీ బ్యాట్ పట్టిన ఏబీ డివిలియర్స్... తనదైన ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ ద్వారా దాదాపు కోటి 13 లక్షల రూపాయల విరాళాలను సేకరించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- వేల మందికి సోనూ సాయం
లాక్డౌన్ వేళ వలస కూలీలకు అండగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూసూద్.. తాజాగా కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న 3 వేల మంది విద్యార్థులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ముందుకొచ్చాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి