ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు 3 PM - ap top ten news

..

3PM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు 3 PM

By

Published : Sep 7, 2022, 3:00 PM IST

  • Chandrababu: ఆ జిల్లా తెదేపా నేతల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి
    Chandrababu: కృష్ణా జిల్లా తెదేపా నేతల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలు చిత్తశుద్ధితో పని చేయాలని హెచ్చరించారు. చెన్నుపాటి గాంధీ వ్యవహారంలో.. సరిగా పోరాటం చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • security పక్కాగా ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల కార్యకలాపాలు
    Security Agencies Act 2005 Amendments ఇక నుంచి ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల పనితీరును, వాటి కార్యకలాపాలు పకడ్బందిగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం(పీఎస్‌ఏఆర్‌ఏ), 2005కు సవరణలు చేసి కేంద్ర హోంశాఖ రూపొందించిన ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ సెంట్రల్‌ మోడల్‌ రూల్స్‌, 2020కి అనుగుణంగా కొత్త నిబంధనలు తీసుకురానుంది. ఏజెన్సీల పనితీరును పీఎస్‌ఏఆర్‌ఏ వెబ్‌పోర్టల్‌ నిత్యం పర్యావేక్షణ చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తల్లి, కూతురు మృతి
    road accident స్వగ్రామంలో బంధువుల మధ్య సంతోషంగా జాతరను జరుపుకున్నారు ఆ కుటుంబసభ్యులు. మంగళవారం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. ఊహించని రీతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతురు ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని రమణేపల్లిగేట్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పరాయి మహిళలపై వ్యామోహం.. భర్తపై వేడి నూనె పోసిన భార్య
    woman poured boiling oil on husband at jiyaguda : పరాయి ఆడవాళ్ల వ్యామోహంలో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని కోపోద్రిక్తురాలైన ఓ భార్య అతడిపై వేడివేడి నూనె పోసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి భార్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దిల్లీలో టపాసులపై నిషేధం పొడగింపు.. ఈసారీ నిశబ్దంగానే దీపావళి!
    firecrackers ban in Delhi: వాయు కాలుష్యాన్ని నివారించేందుకు దిల్లీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలో గతేడాది లాగే ఈ సారి కూడా ఇక దీపావలి పండుగు టపాసుల విక్రయాన్ని నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీవీ ఆపిందని అత్త చేతివేళ్లను విరిచేసిన కోడలు.. మధ్యలో వచ్చిన భర్తను సైతం..
    అత్త కోడళ్ల గొడవ ఏనాటికి ఓ కొలిక్కి రాదన్న నానుడిని నిజమైంది. చిన్న విషయానికే అత్త చేతివేళ్లను విరిచింది ఓ కోడలు. మధ్యలో వచ్చిన భర్తను సైతం కొట్టింది. ఈ ఉదంతం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మరోవైపు, బిర్యానీ వండలేదని భార్యను కత్తితో పొడిచాడు ఓ వ్యక్తి. ఈ ఘటన లాతూర్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ రాజకీయ పార్టీలపై ఐటీ దాడులు.. దేశవ్యాప్తంగా సోదాలు.. బంగాల్ మంత్రికి సీబీఐ సెగ
    ఆదాయ పన్ను శాఖ దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తోంది. ఈసీ జాబితాలో ఉండి, గుర్తింపు పొందని రాజకీయ పార్టీలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. మరోవైపు, బంగాల్​ మంత్రి మొలోయ్‌ ఘఠక్​కు చెందిన ప్రాంతాలపై సీబీఐ సోదాలు చేపట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం ఎంతంటే?
    Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీమ్​ఇండియా ఓటములకు కారణం 19వ ఓవరా?
    భారత్‌కు 19వ ఓవర్‌ ఫోబియా పట్టుకుందా..? ఆసియా కప్‌లో వరుసగా రెండో ఓటమికి ప్రధాన కారణం ఈ ఓవర్‌లో భారీగా పరుగులు ఇవ్వడం. రెండు సార్లు సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమారే బాధితుడు కావడం గమనార్హం. అసలేంటి 19వ ఓవర్‌ ఫోబియా.. టీమ్ఇండియా ఓటమికి సంబంధం ఏంటి..? తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ టార్చర్ తట్టుకోలేక ట్రైన్​ నుంచి దూకేద్దామనుకున్నా: బిగ్​బాస్​ బ్యూటీ
    బిగ్​బాస్​ తాజా సీజన్​ కంటెస్టెంట్​ ప్రముఖ యాంకర్​ నేహా.. కెరీర్​లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపింది. ఆ సంగతులు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details