ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

3PM ఏపీ టాప్​ న్యూస్​

.

3PM TOP NEWS
3PM ఏపీ టాప్​ న్యూస్​

By

Published : Aug 14, 2022, 3:01 PM IST

  • తిరుమలకు పోటెత్తిన భక్తులు శ్రీవారి దర్శనానికి 36 గంటలు
    Tirumala వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కంపార్ట్​మెంట్లు నిండి బయటి వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటలు పడుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈనాడు కథనాలతో విద్యార్థుల్లో ఉప్పొంగుతున్న దేశభక్తి
    Azadi ka Amrit Mahotsav నేటి బాలలే రేపటి పౌరులు. విద్యార్థి దశలోనే వారి మనసుల్లో దేశభక్తిని నింపితే భవిష్యత్‌ మరింత ఉన్నతంగా మారుతుంది. స్వాతంత్య్రం కోసం వీరోచితంగా పోరాడిన తీరు వారికి స్ఫూర్తినిస్తోంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఏడాది కాలంగా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తూ ఈనాడు అలాంటి ప్రయత్నమే చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విశాఖలో అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ
    Agniveer rally in Visakha కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ విశాఖలో మొదలైంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వరకు 18 రోజుల పాటు జరిగే ర్యాలీకి అన్ని సదుపాయాలు కల్పించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ర్యాలీని విజయవంతం చేయడానికి కలెక్టర్ మల్లికార్జున పర్యవేక్షణ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నాగార్జున సాగర్​ 26 గేట్లు ఎత్తి నీటి విడుదల
    nagarjuna sagar 26 gates open నాగార్జున సాగర్​కు కృష్ణమ్మ పరుగులు ఆగడం లేదు గురువారం నుండి వరద ప్రవాహం అధికంగా ఉండడంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ అందాలు చూసేందుకు ఇవాళ భారీగా పర్యటకులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అందుకు తగ్గట్లుగా ట్రాఫిక్ సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆడ కోతి ప్రేమను ఎరగా వేసి రౌడీ కోతిని బంధించిన అధికారులు
    మహారాష్ట్ర అహ్మద్​నగర్​ జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రజలపై దాడి చేస్తున్న మగకోతిని పట్టుకునేందుకు ఆడకోతిని రంగంలోకి దింపారు అటవీ అధికారులు. అనేక సార్లు విఫలయత్నం చేసి చివరకు కోతిని పట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జెండా ఎగురవేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసా
    దేశప్రజలందరికీ గర్వకారణమైన త్రివర్ణ పతాకం ఎగురవేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లోని ఫ్లాగ్‌ కోడ్‌ ఆఫ్‌ ఇండియా చట్టంలో ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. మరి జెండా ఎలా ఎగురవేయాలి, ఆ నిబంధనలు ఏంటి. ఓసారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బస్సుపై చెరుకు లోడ్ పడి 13 మంది మృతి
    Road accident in pakistan బస్సును లారీ ఢీ కొట్టిన ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అధిక రాబడినిచ్చే ట్రేడింగ్ వ్యూహం ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్
    స్టాక్‌ మార్కెట్లో విజయం సాధించేందుకు ఎన్నో మార్గాలు, వ్యూహాలు ఉంటాయి. సూచీలు పెరుగుతున్న వేళ నిష్క్రియాత్మక పెట్టుబడి లేదా ప్యాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఎంచుకోవడం ద్వారా రాబడిని ఆర్జించడం ఇప్పుడు చాలామంది పాటిస్తున్న వ్యూహం. ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు, ఇండెక్స్‌ ఫండ్లను ఇందుకోసం ఎక్కువగా పరిశీలిస్తున్నారు. దీనికి మరింత శక్తిని ఇచ్చే ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌ ఇప్పుడు సరికొత్త వ్యూహం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సెంచరీ జస్ట్​ మిస్​, 44 బంతుల్లో 9 సిక్సర్లతో బ్యాటర్​ వీరవిహారం
    ఇంగ్లాండ్ టీ20 జ‌ట్టు స్టార్ బ్యాటర్​ డేవిడ్ మ‌లాన్ మ‌రోసారి త‌న విశ్వ‌రూపం చూపించాడు. బ్యాట్ నుంచి ప‌రుగుల వ‌ర్షం కురిపించాడు. 44 బంతుల్లో 9 సిక్సర్లు బాదాడు. 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నిఖిల్​ కార్తికేయ 2 సినిమాకు మంచి వసూళ్లు, తొలిరోజే 25 శాతం రికవరీ
    యువ హీరో నిఖిల్ లేటెస్ట్ సినిమా కార్తికేయ 2 హిట్ టాక్ సంపాదించింది. అయితే ఆశించిన సంఖ్యలో సినిమాకు స్క్రీన్లు లభించకపోయినప్పటికీ మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. ఫస్ట్​డే మొత్తం ఎంత వసూలు చేసిందంటే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details