- రెండు వారాల్లోగా ఆ నిధులు వెనక్కి ఇవ్వాలి.. ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం
SUPREME COURT: ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధుల మళ్లింపుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. పీడీ ఖాతాలకు మళ్లించిన నిధులను.. రెండు వారాల్లోగా వెనక్కి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమరావతి రైతులను కలిసిన చంద్రబాబు.. రాజధాని ఎక్కడికి వెళ్లదని భరోసా
CBN MEET: రాజధాని కోసం మందడం శిబిరం వద్ద దీక్ష చేస్తున్న అమరావతి రైతులను.. తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వరదలపై సీఎం జగన్ సమీక్ష.. బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలకు ఆదేశాలు
CM Jagan review: గోదావరి వరదలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పరిస్థితిపై.. ఆయా జిల్లాల ఉన్నతాధికారులు, ఐటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధిత ప్రాంతాల్లో తక్షణ వరద సాయం, పంట నష్టం అంచనా, ప్రస్తుత పరిస్థితిని ఆరా తీశారు. వరద బాధిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం జగన్
Presidential election votes: రాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం జగన్ రాష్ట్రంలో తొలి ఓటు వేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించారు. అనంతరం మంత్రులు, ఎంపీలు మిగిలిన ఎమ్మెల్యేలు ఓటు వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ అనుమానంతో.. యువకుడిని ఉమ్మి నాకించిన పంచాయతీ పెద్దలు!
Youth Forced to Lick Spit: బిహార్ బెగూసరాయ్‌లో అమానవీయ ఘటన జరిగింది. రూ. 12 వేలు దొంగతనం చేశాడనే అనుమానంతో పంచాయతీ పెద్దలు.. ఓ యువకుడిని ఉమ్మి నాకించి, గుంజీలు తీయించిన దుశ్చర్య మోహన్‌పుర్ గ్రామంలో వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ధన్‌ఖడ్ నామినేషన్
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌ఖడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, భాజపా అగ్రనేతలు పాల్గొన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, భాజపా నాయకత్వానికి ధన్‌ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుంతలో పడ్డ గున్న ఏనుగు.. సీపీఆర్ చేసి రక్షించిన సిబ్బంది
థాయ్‌లాండ్ నఖోన్ నాయొక్ రాష్ట్రంలోని ఖావో యాయ్ జాతీయ పార్క్‌లో ఓ భారీ గుంతలో ఏడాది వయసున్న గున్న ఏనుగు పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు తల్లి ఏనుగు శాయశక్తులా ప్రయత్నించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరింత మైలేజ్ ఇచ్చేలా మారుతి 'బడ్జెట్' కార్ అప్డేట్.. రూ.4.5లక్షలకే!
Maruti s presso 2022 model: దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. ఎస్-ప్రెస్సో మోడల్‌ను అప్డేట్ చేసింది. కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ల వివరాలను సోమవారం ప్రకటించింది. మైలేజ్ పెంచేలా ఇంజిన్‌లో మార్పులు చేసింది మారుతి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అంతర్జాతీయ హాకీ సమాఖ్య చీఫ్ పదవికి 'బత్రా' రాజీమానా
అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఐహెచ్ఎఫ్) అధ్యక్షుడు నరిందర్ బత్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐహెచ్ఎఫ్ చీఫ్ పదవితో పాటు ఐఓఏ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..
నాగ చైతన్య మూవీ 'థ్యాంక్యూ', రణ్‌బీర్ కపూర్ నటించిన 'షంషేరా'తో పాటు మరికొన్ని సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్నాయి. వెంకటేశ్ దగ్గుబాటి- వరుణ్ తేజ్ నటించిన ఎఫ్3, ధనుశ్ 'ద గ్రే మ్యాన్'తో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపై ఓ లుక్కేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రధాన వార్తలు @ 3 PM