ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news

..

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

By

Published : Jul 11, 2022, 2:58 PM IST

  • అమర్‌నాథ్​ వరదల్లో.. ఆంధ్రావాసి దుర్మరణం!
    Woman died in Amarnath yatra: రాష్ట్రం నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారిలో.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మహిళ మృతిచెందారు. గుణిశెట్టి సుధ అనే మహిళ మరణించారు. ఆమె మృతదేహం శ్రీనగర్‌ ఆస్పత్రిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త
    MUNICIPAL WORKERS PROTEST: సంవత్సరాల కాలంగా పెండింగ్​లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. పలు జిల్లాల్లో విధులు బహిష్కరించి నిరసనలు చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. వీరికి పలు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గోదావరిలో క్రమంగా పెరుగుతున్న వరద ఉద్ధృతి.. ధవళేశ్వరం వద్ద 8 అడుగుల నీటిమట్టం
    Godavari floods: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు.. గోదావరి నదిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి.. 5లక్షల 27వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజలు పడవల మీద రాకపోకలు సాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విశాఖలో రెచ్చిపోయిన బైక్​ రైడర్స్​.. ఆర్టీసీ డ్రైవర్​పై దాడి
    Bus damage: విశాఖ నగరంలో అర్ధరాత్రి కొంతమంది యువకులు బైక్ ర్యాలీతో బీభత్సం సృష్టించారు. అడ్డువచ్చిన ఆర్టీసీ బస్సును ధ్వంసం చేసి, డ్రైవర్​పై దాడిచేసి గాయపరిచారు. రాత్రి 12 గంటల నుంచి 3గంటల వరకు కొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వీరంగం సృష్టించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నూతన పార్లమెంట్​పై జాతీయ చిహ్నం.. ఆవిష్కరించిన ప్రధాని
    నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం పైఅంతస్థుపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. కాంస్యంతో రూపొందించిన ఈ చిహ్నం మొత్తం బరువు 9,500 కేజీలు కాగా, పొడవు ఆరున్నర మీటర్లు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హిందువుకు ముస్లింల అంత్యక్రియలు.. బక్రీద్ రోజు వెల్లివిరిసిన మతసామరస్యం
    బక్రీద్​ పర్వదినాన మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన జరిగింది. హిందూ మతానికి చెందిన వ్యక్తి మరణించగా.. ముస్లింలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన రాజస్థాన్​లోని జైపుర్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వచ్చే ఏడాది చైనాను దాటి మనమే నెం.1.. ఏ విషయంలో అంటే?
    వచ్చే ఏడాది నాటికి జనాభా విషయంలో చైనాను భారత్ అధిగమిస్తుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2022 నవంబర్​ నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లకు చేరుకుంటుందని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ జనాభా అంచనా 2022 పేరిట ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల శాఖ నివేదికను ప్రచురించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మాల్యాకు సుప్రీం షాక్.. 4నెలల శిక్ష.. రూ.317 కోట్ల డిపాజిట్​కు ఆదేశం
    Vijay mallya news: రూ.9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్​ మాల్యాకు కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేసింది. నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మీకు క్రికెట్‌లో కొత్త రూల్స్‌ తెలుసా...? అక్టోబర్‌ నుంచే అమలు...
    ICC New Rules: క్రికెట్​.. ఇదొక జెంటిల్​మెన్​ గేమ్​. మైదానంలో అడుగుపెట్టాక కచ్చితమైన నిబంధనలు ఉంటాయి. క్రికెటర్లు, అంపైర్లు వాటిని పక్కాగా పాటించాల్సిందే. అయితే 17వ శతాబ్ధంలో ప్రారంభమైన టెస్టు క్రికెట్​ నుంచి ఇప్పటి వరకు ఈ ఆటలో చాలా మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. డీఆర్​ఎస్​ నుంచి ఇటీవలె వచ్చిన కంకషన్​ సబ్​స్టిట్యూట్​ వరకు ఆధునిక కాలంలో వచ్చిన నయా రూల్స్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సస్పెన్స్​గా మంచు విష్ణు 'జిన్నా' ఫస్ట్​లుక్​​.. ధనుష్​ హాలీవుడ్​ మూవీ సర్​ప్రైజ్​
    హీరో ధనుష్ నటిస్తున్న​ హాలీవుడ్ మూవీ 'ది గ్రే​ మ్యాన్​' నుంచి ఓ స్పెషల్​ అప్డేట్​ వచ్చింది. దీంతో పాటే మంచు విష్ణు నటిస్తున్న 'జిన్నా' సినిమా ఫస్ట్​లుక్​ మోషన్​ పోస్టర్​ విడుదలైంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details