ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news

..

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

By

Published : Jul 7, 2022, 2:59 PM IST

  • నిఘాకోసం ఖర్చు పెడుతున్న నిధులపై ఆడిట్‌ చేయించగలరా ?: పయ్యావుల
    జగన్ సర్కారు ప్రతిపక్షాలతో పాటు అనేక మందిపై ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిఘా పెట్టిందని.. తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. తాను చెప్పేది అవాస్తవమని ప్రభుత్వం చెప్పాలనుకుంటే.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఆడిట్‌ చేయించగలరా ? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మా బడి.. మాకు కావాలి'.. పాఠశాల విలీనంపై కొనసాగుతున్న ఆందోళనలు
    SCHOOLS PROTEST: ప్రాథమిక స్కూళ్లను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంపై ఆందోళనలు వెల్లువెత్తున్నాయి. సమీపంలోని స్కూళ్లను తీసేయడం వల్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు తమ పిల్లల్ని పంపాల్సి వస్తోందని వాపోతున్నారు. దీనివల్ల తమ పిల్లలు ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని చదువుకు దూరం చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వమే కల్పిస్తోందని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పులివెందుల చేరుకున్న సీఎం.. ముఖ్యనాయకులతో సమావేశం
    ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల పర్యటన కోసం వైఎస్సార్ జిల్లాకు చేరుకున్నారు. పులివెందుల ఆర్​అండ్​బీ అతిథి గృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో జగన్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఏపీ కార్లలో బయో సైన్స్ టెక్​ను సీఎం ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Nagababu: భీమవరంలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు
    NAGABABU TWEET: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో మా అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించిన.. మహా నటులందరికీ నా అభినందనలు అంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సినీనటుడు కొణిదెల నాగబాబు ట్వీట్‌ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మోదీ మా సేవల్ని గుర్తించారు'.. ఇళయరాజా, పీటీ ఉష హర్షం
    Rajya Sabha nomination Ilaiyaraaja: రాజ్యసభకు తమను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఇళయరాజా, పీటీ ఉష. ఈ అవకాశాన్ని తమకు దక్కిన గౌరవంగా భావిస్తామని చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని తాను ఊహించలేదని వీరేంద్ర హెగ్గడే పేర్కొన్నారు. మరోవైపు, వీరికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమ్మ, ఇద్దరు కూతుళ్లు.. ఒకేసారి బోర్డ్​ ఎగ్జామ్స్​ పాస్​
    విద్యకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు త్రిపుర అగర్తలాకు చెందిన షీలా రాణి దాస్. 53 ఏళ్ల వయసులో ఇద్దరు కుమార్తెలతో కలిసి బోర్డు పరీక్షలు రాసి పాసయ్యారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్రిటన్ ప్రధాని రాజీనామా! 'మూర్తి గారి అల్లుడి' ఎఫెక్ట్​!!
    Boris Johnson resigns: బ్రిటన్​ రాజకీయ సంక్షోభం క్లైమాక్స్​కు చేరింది. ప్రధాని పదవి నుంచి వైదొలిగేందుకు బోరిస్ జాన్సన్​ ఎట్టకేలకు అంగీకరించారు. గురువారమే ఆయన రాజీనామాపై ప్రకటన చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వంట నూనెల ధర రూ.10 తగ్గించండి'.. కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
    edible oil price reduce: వంట నూనెల ధరలను లీటర్​కు రూ.10 వరకు తగ్గించాల్సిందిగా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాతీయంగా నూనెల ధరలు తగ్గినందున.. ఆ ప్రయోజనాన్ని వినియోగదార్లకు బదలాయించాల్సిందిగా సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీ20 వరల్డ్​కప్​కు ముందే భారత్​- పాక్​ ఢీ.. రివెంజ్​కు ఛాన్స్!
    Asia Cup: టీ20 వరల్డ్​కప్​కు ముందు పొట్టి ఫార్మాట్​లోనే ఆసియా కప్​ను నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. అయితే గతేడాది పాక్​ చేతిలో పరాజయం పాలైన భారత్.. ఈసారి​ ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్‌ 28న భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్​ ఉండనుందని తెలిసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నాగ్​ 'ది ఘోస్ట్​' అదిరే అప్డేట్​.. 'యువ‌రాణి'గా త్రిష
    నాగార్జున హీరోగా న‌టిస్తున్న 'ది ఘోస్ట్' చిత్రం ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్ర‌చారాన్ని చిత్ర యూనిట్ ఖండించి టీజర్​ రిలీజ్​ డేట్​ను ప్రకటించింది. నాగ్​ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది. మరోవైపు, విల‌క్ష‌ణ చిత్రాల ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం రూపొందిస్తున్న తాజా చిత్రం 'పొన్నియ‌న్ సెల్వ‌న్‌'లో త్రిష ఫ‌స్ట్ లుక్‌ను గురువారం విడుద‌ల‌ చేశారు మేకర్స్​.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details