ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news

..

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

By

Published : Jul 4, 2022, 2:58 PM IST

  • దేశభక్తుల పురిటిగడ్డ ఆంధ్ర.. అల్లూరి స్ఫూర్తిని కొనసాగించాలి : ప్రధాని మోదీ
    ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సభా ప్రాంగణం నుంచే వర్చువల్‌ ద్వారా విగ్రహావిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోదీ.. మన్యం వీరుడికి ఘనంగా నివాళులర్పించారు. ప్రధాని ప్రసంగం ఇలా సాగింది.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రధాని పర్యటనను నిరసిస్తూ నల్ల బెలూన్లు ఎగరవేత.. పలువురి అరెస్టు!
    BLACK BALLOONS: పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాని పర్యటనను నిరసిస్తూ.. కాంగ్రెస్‌ నాయకులు పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో నల్లబెలూన్లను ఎగురవేసి.. కాంగ్రెస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి: సీఎం జగన్‌
    CM JAGAN: తెలుగుజాతి, భారతదేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు అని ముఖ్యమంత్రి జగన్‌ కొనియాడారు. అల్లూరి ఘనతను గుర్తుంచుకునే.. ఆయన పేరు మీద జిల్లా పెట్టుకున్నామని చెప్పారు. ప్రతి మనిషి గుండెల్లో అల్లూరి చిరకాలం ఉంటారన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లక్కవరం యూనియన్ బ్యాంకుకు తాళం వేసిన రైతులు
    LOCK TO UNION BANK:ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని యూనియన్ బ్యాంకు వద్ద రైతుల ఆందోళన చేస్తున్నారు. పంట రుణాల జమలో అవకతవకలపై న్యాయం చేయాలంటూ బ్యాంకుకు తాళం వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అవును! మాది ఈడీ ప్రభుత్వమే.. నన్ను ట్రోల్ చేసినవారిని..'.. ఫడణవీస్ విక్టరీ స్పీచ్
    Maharashtra ED government: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు! తమది ఈడీ ప్రభుత్వమేనంటూ వ్యాఖ్యానించారు. అయితే 'ఈడీ' అంటే అర్థం ఏక్​నాథ్- దేవేంద్ర ప్రభుత్వమని వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నేను డిక్టేటర్​గా మారతా.. వారి సంగతి చూస్తా'.. సీఎం స్ట్రాంగ్​ వార్నింగ్​!
    ప్రజాప్రతినిధులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే తాను నియంతలా మారి కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు తమిళనాడు సీఎం స్టాలిన్. మహిళా ప్రతినిధులు తమ బాధ్యతలను భర్తలకు అప్పజెప్పకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. తాను ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష అనుభవించానని, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని గుర్తుచేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అగ్నిపథ్'​పై వచ్చే వారం సుప్రీం విచారణ
    దేశంలో సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభమైనప్పుడు వాదనలు వింటామని వెకేషన్​ బెంచ్​ తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • క్రెడిట్ కార్డులు ఎన్నైనా ఉండొచ్చా? ఎక్కువ ఉంటే ఇబ్బందా?
    multiple credit cards: క్రెడిట్ కార్డుల గురించి చాలా మందిలో సందేహాలు ఉంటాయి. ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండొచ్చు? ఎక్కువ కార్డులు ఉంటే ఏమైనా ఇబ్బందులా? ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి. కార్డ్‌ల సంఖ్య.. మీ ఖర్చు, అలవాట్లు, మీ జీవనశైలి, ఎక్కువ కార్డ్‌లను నిర్వహించడంలో మీ సామర్థ్యం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డుల గురించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మసాజ్​ చేయమని, బట్టలు ఉతకమని టార్చర్​ పెట్టారు: స్టార్​ స్ప్రింటర్​ ద్యుతి
    Dutee Chand Ragging: దేశంలోనే అత్యంత వేగవంతమైన మహిళా రన్నర్‌గా పేరున్న ద్యుతి చంద్​.. తాను ఎదుర్కొన్న వేధింపుల సమస్యను బయటపెట్టింది. తనను బలవంతంగా మసాజ్​ చేయమని, బట్టలు ఉతకమని టార్చర్​ పెట్టారని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పవర్​ఫుల్​గా 'అల్లూరి' టీజర్​.. హృదయాన్ని హత్తుకుంటున్న 'సీతారామం' సాంగ్​
    Sree Vishnu Alluri teaser: శ్రీవిష్ణు హీరోగా.. పోలీస్‌ అధికారి ఫిక్షనల్‌ బయోపిక్‌గా రూపొందుతున్న సినిమా 'అల్లూరి'. తాజాగా ఈ మూవీ టీజర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. మరోవైపు దుల్కర్​ సల్మాన్​ నటించిన 'సీతారామం'లోని సెకండ్ సాంగ్​​ విడుదలై హృదయాన్ని తాకేలా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details