ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news

..

AP TOP NEWS
ప్రధాన వార్తలు @ 3PM

By

Published : Jun 27, 2022, 2:59 PM IST

  • అలిగి వెళ్లిపోయిన కేంద్ర మాజీమంత్రి..!
    ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో.. మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి అలిగారు. శ్రీకాకుళం ఆర్ అండ్ బీ అతిథి గృహం హెలీపాడ్ వద్దకు వచ్చిన కృపారాణి.. ప్రొటో కాల్ జాబితాలో తన పేరు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ధర్మాన కృష్ణదాస్ సద్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. ఆమె శాంతించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CM Jagan: మనిషి తలరాత మార్చే శక్తి చదువుకే ఉంది: సీఎం జగన్‌
    CM Jagan: సమాజం, దేశం, మనిషి తలరాత మార్చే శక్తి చదువుకే ఉందని..ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ‘జగనన్న అమ్మఒడి’ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేవలం జగనన్న అమ్మఒడి కింద ఇప్పటి వరకు రూ.19,618 కోట్లు జమ చేశామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కేసీఆర్ ఇలాఖాలోకి.. రైలు బండి!
    సీఎం కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్​కు నేటినుంచి గూడ్స్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఇందుకోసం గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌లో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Rains: తెలంగాణలో చిరు జల్లులు
    Telangana Rains Today : రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని పేర్కొంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సంజయ్​ రౌత్​కు​ ఈడీ సమన్లు.. 'మహా' సంక్షోభం వేళ 'కుట్ర'!
    Sanjay Raut ED case: మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని సూచించింది. ఈడీ సమన్లను 'కుట్ర'గా అభివర్ణించారు సంజయ్ రౌత్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మా అందరి గమ్యం అగ్నిపథ్​'.. ఆ గ్రామ యువత ప్రతిజ్ఞ!
    AGNIPATH SCHEME: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకం కింద సైనికులుగా చేరతామని ప్రతిజ్ఞ చేశారు గుజరాత్​లోని ఓ గ్రామానికి చెందిన యువతీయువకులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఫ్రెండ్​ కార్​లో షికారుకు వెళ్లడమే అతడి పొరపాటు.. దారుణంగా కాల్చి...
    సరదాగా షికారు చేద్దామని తన స్నేహితుడి దగ్గర నుంచి కారు తెచ్చుకున్నాడు ఓ యువకుడు. ఆ తర్వాత తన ఇంటి ముందు కారు పార్క్​ చేసి లోపల కూర్చున్నాడు. అంతలోనే.. ఓ దుండుగుడు వచ్చి కాల్చి చంపి పారిపోయాడు. ఇదంతా ఏదో సినిమాలో జరిగినట్టు అనిపిస్తుంటుంది.. కానీ, ఇప్పుడు ఇలాంటి ఘటనే న్యూయార్క్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • స్టాక్​ మార్కెట్లోకి తొలి అడుగు.. 'సూచీ ఫండ్ల'తో మేలు!
    Index Funds: మీరు మొదటిసారిగా స్టాక్​ మార్కెట్లో అడుగుపెట్టాలనుకుంటున్నారా? ఏం చేయాలో, ఎటువంటి మార్గం అనుసరించాలో డౌట్​గా ఉందా?.. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడుల ప్రయాణంలో తొలి అడుగు వేయటానికి 'ఇండెక్స్‌ ఫండ్స్‌' (సూచీ ఫండ్లు)ను పరిగణనలోకి తీసుకోవటమే సరైన నిర్ణయం. అయితే సూచీఫండ్లకు సంబంధించిన వివరాలు, ప్రత్యేకతలు, పథకాలు తెలుసుకుందాం రండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐర్లాండ్​తో మ్యాచ్​లో భువి అరుదైన రికార్డ్
    Bhuvneshwar Kumar Ireland: ఐర్లాండ్​తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్​లో భారత పేసర్​ భువనేశ్వర్​ రికార్డు సృష్టించాడు. పవర్​ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా ఘనత సాధించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Vaishnav Tej: ఆ పని సరైన వయసులోనే చేశా!: వైష్ణవ్‌ తేజ్
    Vaishnav Tej: హాట్ బ్యూటీ కేతికా శర్మతో కలిసి మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన చిత్రం 'రంగ రంగ వైభవంగా'. ఈ సినిమా టీజర్​ విడుదల అయిన సందర్భంగా అభిమానులతో సరదాగా ముచ్చటించింది చిత్రబృందం. ఇందులో భాగంగా తన పలు ఆసక్తికర విషయాలను తెలిపారు వైష్ణవ్​. ఆ సంగతులివీ.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details