ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

..

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

By

Published : Jun 22, 2022, 2:47 PM IST

Updated : Jun 22, 2022, 3:01 PM IST

  • ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్​లో వాళ్లే !
    ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి సంవత్సరంలో 54, రెండో సంవత్సరంలో 61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని.. విద్యాశాఖ మంత్రి బొత్స వెల్లడించారు. ఉత్తీర్ణత శాతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా తొలిస్థానంలో ఉండగా.. ఉమ్మడి కడప జిల్లా చివరిస్థానంలో నిలిచింది పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • MLA VAMSHI: అస్వస్థతకు గురైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..
    MLA VAMSHI: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. పంజాబ్​లోని మొహాలీ క్యాంపస్‌లో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరైన వంశీకి.. ఎడమచేయి విపరీతంగా లాగినట్లు అనిపిస్తుండటంతో.. స్థానికంగా ఉన్న ఓ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మావోయిస్టుల ఎటాక్.. పోలీసుల అలర్ట్..
    POLICE ALLERT: సీఆర్​ఫీఎఫ్​ పోలీసులపై మావోయిస్టుల దాడితో ఒడిశాలోని నువాపాడా జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పటాధర అటవీ ప్రాంతంలో జరిగిన మావోయిస్టుల దాడిలో ముగ్గురు సీఆర్​ఫీఎఫ్​ పోలీసులు మరణించగా.. ఏడుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CROP INSURANCE: పొలం ఒకరిది.. పరిహారం మరొకరికి!
    CROP INSURANCE: పంట నష్టపోయిన రైతుకు దక్కాల్సిన బీమా మొత్తం.. సెంటు భూమి లేని వ్యక్తుల ఖాతాల్లో జమయింది..! అన్నదాతను ఆదుకునేందుకు వెచ్చించాల్సిన నిధులు.. అధికార పార్టీ అనుంగులు, వాలంటీర్లు, వారి కుటుంబసభ్యుల ఖాతాల్లో చేరాయి..!! పంట బోదెలు, ఇతర రైతుల సర్వే నెంబర్ల మీద పంట పరిహారం, బీమా డబ్బులు కాజేసిన వైనం.. కోనసీమ జిల్లా ఆలమారు మండలంలో కలకలం రేపుతోంది. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తెలుగుదేశం ఆధ్వర్యంలో రైతులు వ్యవసాయశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రద్దు దిశగా మహా అసెంబ్లీ? సంజయ్‌ రౌత్‌ సంచలన ట్వీట్‌
    Maharashtra news eknath shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయడం ఖాయమేనని తెలుస్తోంది. 'అసెంబ్లీ రద్దు' గురించి శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన ట్వీట్‌ ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది. మరోవైపు ఉద్ధవ్​ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తన ట్విటర్‌ బయో నుంచి 'రాష్ట్ర మంత్రి' అనే పదాన్ని తొలగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 12 ఏళ్ల బాలికకు బలవంతంగా రెండు పెళ్లిళ్లు.. గర్భం దాల్చాక!
    12 year old girl pregnant: 12 ఏళ్ల బాలికకు బలవంతంగా రెండు వివాహాలు చేసిన ఘటన ఉత్తరాఖండ్​లో జరిగింది. తాజాగా మైనర్ గర్భం దాల్చడం వల్ల ఈ దారుణం బయటపడింది. బాధితురాలికి బలవంతంగా పెళ్లిళ్లు చేసిన ఆమె తల్లి, బాధితురాలి రెండో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీ భూకంపం.. 255 మంది మృతి!
    Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్​లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు అప్గానిస్థాన్​లోని పక్టికా ప్రావిన్స్​ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 255 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా సంస్థ బఖ్తర్​ వెల్లడించింది. రిక్టర్​ స్కేల్​పై భూకంప తీవ్రత 6గా నమోదైనట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
    Gold Price Today: బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,390గా ఉంది. కిలో వెండి ధర రూ.62,024గా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రోహిత్​, కోహ్లీలకు బీసీసీఐ స్ట్రాంగ్​ వార్నింగ్​!
    BCCI Warning Kohli Rohith: భారత్​-ఇంగ్లాండ్​ మధ్య జరగనున్న ఐదో టెస్టు కోసం ఇంగ్లాండ్​ వెళ్లిన టీమ్​ఇండియా ఆటగాళ్లు రోహిత్​ శర్మ, విరాట్​ కోహ్లీలకు బీసీసీఐ వార్నింగ్​ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ను తేలిగ్గా తీసుకోవద్దంటూ ఆ ఇద్దరి ఆటగాళ్లను హెచ్చరించాలని భావిస్తోందట. అసలు ఏం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నటుడి ప్రాణం మీదకు తెచ్చిన విన్యాసం.. విమానంలో ఆస్పత్రికి తరలింపు!
    సముద్ర తీరంలో చేసిన విన్యాసాలు.. ఓ యువ నటుడి ప్రాణం మీదకు తెచ్చాయి. వెంటనే అతడిని విమానంలో బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి శస్త్రచికిత్స నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
Last Updated : Jun 22, 2022, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details